దేవులపల్లి కృష్ణశాస్త్రి
స్వరూపం
దేవులపల్లి కృష్ణశాస్త్రి Devulapalli krishnasastry ప్రముఖ తెలుగుకవి. ఇతను తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు. ఇతను రచించిన ప్రముఖ కావ్యసంపుటి కృష్ణపక్షము.
వ్యాఖ్యలు
[మార్చు]కవిత్వం
[మార్చు]- నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు? నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు?
- దిగిరాను దిగిరాను దివినుంచి భువికి...
- నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు...
- మనం ఒక్క క్షణంలో కోల్పోయిన దాన్ని తిరిగి ఒక దశాబ్దంలో కూడా పొందలేకపోవచ్చు.[1]
- కన్నీళ్ళలోంచి కావ్యం ఎలాగ జన్మించిందో, కావ్యం వల్ల కన్నీరూ అలాగే పుడుతోంది. ఈ కన్నీరు మళ్ళీ సృష్టించే శక్తి ఇస్తుంది.
- ప్రాణసఖుడె నా కోసమై పంపినాడు/ పల్లకీయన హృదయమ్ము జల్లుమనియె/ వీడని వియోగమున వేగు మ్రోడుమేను/ తలిరుతోరణమై సుమదామమాయె.
- ముసలితనంలో మూగతనం భయంకరం-శిథిల మందిరంలో అంధకారం లాగున
- అంతరాంతరము నీ యమృత వీణేయైన/ మాట కీర్తనమౌను, మనికి వర్తనమౌను/ ఈ యనంతపథాన ఏ చోటికాచోటు/ నీ యాలయమ్మౌను నీ యోలగమ్మౌను.
సినిమా పాటలు
[మార్చు]- ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు ఏడ తానున్నాడో బావ జాడ తెలిసిన పోయిరావా అందాల ఓ మేఘమాల - w:మల్లీశ్వరి
- మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో - w:మల్లీశ్వరి
- సడిసేయ కో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే - w:రాజమకుటం
- ఏమి రామ కథ శబరీ శబరీ ఏదీ మరియొక సారి - w:భక్త శబరి
- మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది - w:సుఖదుఃఖాలు
- ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది - w:సుఖదుఃఖాలు
- రావమ్మా మహాలక్ష్మి రావమ్మా నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని - w:ఉండమ్మా బొట్టు పెడతా
- అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అదియే దైవం - w:ఉండమ్మా బొట్టు పెడతా
- శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా చేనంతా గంగమ్మా వానా తిరుమలపై వెంకన్న కను విప్పేనా కరుణించు ఎండా వెన్నెలలైనా - w:ఉండమ్మా బొట్టు పెడతా
- నీ పదములే చాలు రామా నీ పద ధూళులే పదివేలు - w:బంగారు పంజరం
- ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి - w:ఏకవీర
- నేలతో నీడ అన్నది నను తాకరాదని, పగటితో రేయన్నది నను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది - w:మంచి రోజులు వచ్చాయి
కృష్ణశాస్త్రి గురించి వ్యాఖ్యలు
[మార్చు]- కృష్ణశాస్త్రి బాధ ప్రపంచమంతటికీ బాధ/ ప్రపంచమంతటి బాధ శ్రీశ్రీ బాధ.
- చలం, మహాప్రస్థానం కవితాసంకలనం ముందుమాట యోగ్యతాపత్రంలో(1950).
మూలాలు
[మార్చు]- ↑ teluguquotations.blogspot.in