రామానుజాచార్యుడు

వికీవ్యాఖ్య నుండి

దక్షిణ భారత దేశంలోని చెన్నపట్నానికి(నేటి చెన్నై నగరం) 30 మైళ్ళు దక్షిణాన ఉన్న శ్రీపెరుంబుదూర్(శ్రీపెరుంపుత్తూరు) అనే ఊరిలో పుట్టి యావత్ భారతదేశానికి వైష్ణవ మతాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నేర్పిన మహాపురుషుదు రామానుజాచార్యుడు. ప్రస్థానత్రయమయిన బ్రహ్మ సూత్రములు-ఉపనిషత్తులు-భగవద్గీత లకు భాష్యం రాసిన భాష్యకారుడు. కుల మత భేదం లేకుండా హిందూ దైవారాధనకు గుడిలో ప్రవేశానికి అనుమతినిచ్చి, అన్ని వైష్ణవ దేవాలయాలకూ పూజాదిక తంతులను నిర్దేశించిన వ్యక్తి ఇతడు.

రామానుజుని ముఖ్యమయిన వ్యాఖ్యలు[మార్చు]

  • ఇంద్రియ వస్తువులే ఇంద్రియాలకు ఆహారం. ఎవడయితే తన ఇంద్రియాలను వస్తువులనుండి దూరం చేసుకుంటాడో, అతడి నుండి ఇంద్రియ వస్తువులూ దూరం అవుతాయి. ఐనప్పటికీ ఆ వస్తువులపై ఇష్టం అతనికి ఉండవచ్చు.
  • ఇష్టం అనేది వ్యామోహమే. అందువలన ఇంద్రియ వస్తువులను త్యజించినంత మాత్రాన వాటిపై వ్యామోహం పోదు.