విలియం షేక్స్పియర్
స్వరూపం
విలియం షేక్స్‌పియర్ ప్రముఖ ఆంగ్ల రచయిత. ఇతడు బ్రిటన్‌కు చెందినవాడు. ఏప్రిల్ 26, 1564లో జన్మించాడు. ఏప్రిల్ 23, 1616న మరణించాడు. ఇతని ప్రముఖ రచనలు: యాజ్ యు లైక్ ఇట్, ది మర్చంట్ ఆఫ్ వెనైస్, ది టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, జూలియస్ సీజర్, హామ్లెట్, ఆంటోనీ అండ్ క్లియోపాత్ర.
విలియం షేక్స్‌పియర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు.[1]
- ప్రపంచమే ఒక నాటకరంగం, ప్రజలందరూ అందులో పాత్రధారులే.
- ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు.
- నేను వచ్చాను, చూశాను, సాధించాను.[2]
- పిరికివాళ్ళు చావడానికి ముందు అనేకసార్లు చస్తుంటారు.[3]
- మూర్ఖుడైన మిత్రుడు వివేకవంతుడైన శతృవుకంటె ప్రమాదం.
- ఇతరుల సలహాపై ఆధారపడకు, నీ ఆలోచనలను నువ్వు అనుసరించు.
- బాలలు తల్లిదండ్రుల సంపద.
- అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ హాని తలపెట్టకు.
- డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టు కోవడం మాత్రం మంచిది కాదు.
- పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు,
- కానీ ధైర్యసాహసాలు గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు.
- ఒక సారి నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు.
- ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి అందుచే వ్యర్ధంగా పాడు చెయ్యవద్దు.
- వివేక శూన్యుడైన మిత్రుడు , వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం.
- మంచి చెడు అనేది ఏమి లేదు, ఆలోచనే అలా చేస్తుంది.
- పుకారు అనేది ఊహలు,భావనలు,అసూయ కలిపి ఉదాబడే పిల్లనగ్రోవి.
- సద్గుణాన్ని మించిన సౌందర్యం లేదు.
- దొంగవాడు ధనవంతుని దోచుకొని జీవనం సాగిస్తున్నాడు.
- మంచి కాలం పుడుతుందనే నమ్మకం తప్ప బలహీనులకు వేరే మందు లేదు.
- మనస్సులో తప్పు చేశామన్న భావన వున్నవారు ప్రతి కళ్లు తమను చూస్తూన్నాయని తలుస్తారు.
- రాజకీయ నాయకులు భగవంతుణ్ణే ఎదురించే తెలివి గలవారు.
- మనసు తప్ప కొరత ఉన్నది ప్రకృతిలో వేరే లేదు. ప్రేమ లేనివారే అంగ విహీనులు.
- నిజమైన నమ్మకం వివేకవంతమైనది. పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది. రాజులను అది దేవతలను చేస్తుంది. సామాన్యులను అది రాజులను చేస్తుంది.
- ఎప్పుడు మనం అదృష్టం అనే దేవతను అధికముగా కోరుకుంటున్నమో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దభాయించి చూస్తుంది.
- చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి. జాలి లేని దుర్మార్గులు దానిని ఘోరమైన ఆయుధముగా ఉపయోగిస్తున్నారు.
- సంగీతానికి ఒక మైమరపించే శక్తి కలదు. చెడుని మంచి దానిగా చేస్తుంది. మంచి దానిని చెడుగా మారుస్తుంది.
- తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
- ఊహలు, భావనలు, అసూయ కలగలిసిన శ్రావ్యగీతాలే వదంతులు.
- తక్కువ కళతో ఎక్కువ విషయాన్ని చెప్పాలి.
- ఒక పని వంద మాటలతో సమానం.[4]
మూలాలు
[మార్చు]- ↑ Twelfth Night రచన లోని వ్యాఖ్య
- ↑ జూలియస్ సీజర్ నాటకంలో విలియం షేక్స్పియర్
- ↑ జూలియస్ సీజర్ నాటకంలో విలియం షేక్స్పియర్
- ↑ http://teluguquotations.blogspot.in/