విలియం షేక్స్‌పియర్
Wikiquote నుండి
విలియం షేక్స్‌పియర్ ప్రముఖ ఆంగ్ల రచయిత. ఇతడు బ్రిటన్‌కు చెందినవాడు. ఏప్రిల్ 26, 1564లో జన్మించాడు. ఏప్రిల్ 23, 1616న మరణించాడు. ఇతని ప్రముఖ రచనలు: యాజ్ యు లైక్ ఇట్, ది మర్చంట్ ఆఫ్ వెనైస్, ది టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, జూలియస్ సీజర్, హామ్లెట్, ఆంటోనీ అండ్ క్లియోపాత్ర.
విలియం షేక్స్‌పియర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
- కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు.
- Twelfth Night రచన లోని వ్యాఖ్య.
- ప్రపంచమే ఒక నాటకరంగం, ప్రజలందరూ అందులో పాత్రధారులే.
- ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు.
- నేను వచ్చాను, చూశాను, సాధించాను.
- జూలియస్ సీజర్ నాటకంలో విలియం షేక్స్పియర్.
- పిరికివాళ్ళు చావడానికి ముందు అనేకసార్లు చస్తుంటారు.
- జూలియస్ సీజర్ నాటకంలో విలియం షేక్స్పియర్.
- మూర్ఖుడైన మిత్రుడు వివేకవంతుడైన శతృవుకంటె ప్రమాదం.