సారా అలీ ఖాన్

వికీవ్యాఖ్య నుండి
సారా అలీ ఖాన్

1995 ఆగష్టు 12న ముంబైలో పటౌడీ కుటుంబంలో సారా అలీ ఖాన్ జన్మించింది. [1]ఆమె హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు సైఫ్ అలీ ఖాన్, అతని మొదటి భార్య అమృతా సింగ్ కుమార్తె. రుక్సానా సుల్తానా, శివిందర్ సింగ్ విర్క్‌ల మనుమరాలు కూడా. సారా అలీ ఖాన్ 2016లో కొలంబియా యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఆమె తన నటనా జీవితాన్ని 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన కేదార్‌నాథ్ చిత్రంతో ప్రారంభించింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా పెద్ద విజయాన్నిచ్చింది. పైగా ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది.[2] అలాగే సారా అలీ ఖాన్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు(IIFA) కూడా కైవసం చేసుకుంది.

వ్యాఖ్యలు[మార్చు]

  • ఇతరుల పట్ల గౌరవంగా ఉండటం, ప్రేమించే, శ్రద్ధ వహించే స్వభావం నేను ఆరాధించే కొన్ని లక్షణాలు.[3]
  • నాకు సర్వశక్తిమంతునిపై విశ్వాసం ఉంది. ఆయన దయను నమ్ముతాను.
  • నేను ఈ రోజు ఉన్న స్థానానికి చేరుకోవడానికి కష్టపడ్డాను.
  • యూత్ ను ప్రభావితం చేస్తున్నామని ప్రేక్షకులు భావిస్తే, మేము పోషించే కొన్ని పాజిటివ్ పాత్రల నుంచి వారు స్ఫూర్తి పొందాలని నేను కోరుకుంటున్నాను[4]
  • హేటర్స్ దృష్టిని ఆకర్షించడానికి ఎంతవరకైనా వెళ్ళవచ్చు. నేను ట్రోలింగ్ కు అలవాటు పడ్డాను.
  • ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే కంటెంట్ వారిని ఎట్రాక్ట్ చేస్తుంది.
  • మా నాన్నతో నాకు అందమైన అనుబంధం ఉంది. ఆయనకు స్వచ్ఛమైన హృదయం ఉంది నాకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చారు.
  • మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మీకు ప్రేమ, ద్వేషం రెండూ లభిస్తాయి.
  • కొంతమంది నా పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ పరుషమైన కామెంట్లు పెడుతున్నారు. మొదట్లో, వారు నన్ను ఇబ్బంది పెట్టేవారు, ప్రభావితం చేసేవారు, కాని తరువాత వారు ముఖం లేని వ్యక్తులు అని నేను గ్రహించాను.
  • బిగ్ బాస్ కు ముందు కూడా నేను డైలీ సీరియల్ చేస్తూ పాపులర్ అయ్యాను, రియాలిటీ షో చేశాను.
  • ఇతరుల పట్ల గౌరవంగా ఉండటం, ప్రేమించే, శ్రద్ధ వహించే స్వభావం నేను ఆరాధించే కొన్ని లక్షణాలు.[5]
  • ట్రోల్స్ పై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. వారెవరూ నాకు ఆహారం ఇవ్వడం లేదు, పట్టించుకోవడం లేదు.
  • పుకార్లను గుడ్డిగా అనుసరించడం ద్వారా ప్రజలు ఇతరులను జడ్జ్ చేయడం మానేస్తారని నేను ఆశిస్తున్నాను.
  • నేను నా కుటుంబంతో మరింత కనెక్ట్ అయ్యాను ఎందుకంటే నేను నా తండ్రి, తల్లి వైపు నుండి నా కుటుంబ సభ్యులందరినీ జోడించిన ఒక సమూహాన్ని రూపొందించాను.
  • గాయనిగా ఉండటం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మీరు ఇతరులకు ఆనందాన్ని అందిస్తున్నారని నేను భావిస్తున్నాను.


మూలాలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.