Wikiquote:వర్తమాన ఘటనలు

Wikiquote నుండి
వార్తల్లోని వ్యాఖ్యలు
  • సాక్షి పత్రిక ఆవిర్భావమే బ్లాక్ డే--టి దేవేందర్ గౌడ్ (తెలుగు దేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు)[1]
  • సున్నా వచ్చినా సీట్లెలా ఇస్తారు-- నరసింహన్ (గవర్నర్)[2]
  • కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే కాంగ్రెస్‌కు సమాధి కట్టి స్మారక భవనం కూడా నిర్మిస్తారు-- శంకర్రావు (మాజీ మంత్రి)[3]
  • కిరణ్ పాలన కుర్చీ కాపాడుకునేందుకే- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[4]
  • పార్లమెంటులో 543 రోగిష్టులు కూర్చున్నారు -- బాబారాందేవ్[5]
  • సచిన్‌ను రాజ్యసభకు పంపుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అసలైన డర్టీ పిక్చర్‌కు నిదర్శనం--బాల్ థాకరే[6]
  • రావణాసురుడు, నరకాసురుడు, బకాసురుడు, మారీచుడు పురాణాల్లో ఉండేవారు. ఇప్పుడు వారంతా రాష్ట్రంలో పుట్టారు -- చంద్రబాబునాయుడు[7]
  • చంపేవాడికంటే చంపించే వాడే పెద్ద క్రిమినల్ -- వి.హనుమంతరావు (కాంగ్రెస్ సీనియర్ నాయకుడు) [8]
  • ప్రజలకు పప్పుబెల్లాలు పంచి కొడుకుకి కోట్ల రూపాయలు దోచిపెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేకర్ రెడ్డి -- చంద్రబాబు నాయుడు[9]
  • కాంగ్రెస్ పార్టీ పాడి ఆవు అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి దున్నపోతు లాంటిది -- డొక్కా మాణిక్యవరప్రసాద్ (రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి)[10]
  • ఐపీఎల్ కారణంగా బాగా ఆడేవాళ్ళు కాదు, అడ్డంగా బాదేవాళ్లే తయారౌతున్నారు -- అర్జున రణతుంగ[11]
  • వై.ఎస్.బతికుంటే జైల్లో ఉండేవాడు -- వి.హనుమంతరావు (రాజ్యసభ సభ్యుడు) [12]
  • ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన ముహుర్తం బాగా లేదనుకుంటాను -- కిరణ్ కుమార్ రెడ్డి[13]
  • ధోని తెలివైన కెప్టెన్ కాడు -- అజహరుద్దీన్[14]
  • వైఎస్ సంతకాల రాజా.. జగన్ వసూళ్ళ రాజా -- ముద్దుకృష్ణమ నాయుడు [15]
  • విద్యార్థినులు జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలి -- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి[16]
  • హరిత విప్లవం ఓ భ్రాంతి -- సుభాష్ పాలేకర్ (ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు)[17]
  • మన్మోహన్ సింగ్ శిలా ప్రతిమలాగా పార్లమెంటులో కూసుంటున్నడు -- కోదండరాం [18]
  • తెలుగుదేశం పార్టీ మా ఆడపడచు -- నందమూరి హరికృష్ణ [19]
  • తెలుగుదేశం పార్టీలో ఉంటే చచ్చిపోతారు, వచ్చేయండి -- నాగం జనార్థన్ రెడ్డి[20]
  • కెప్టెన్, వైస్‌కెప్టెన్‌ల సంబంధం భార్యాభర్తల లాంటిది -- రాహుల్ ద్రవిడ్[21]
  • రాహుల్ గాంధీ కన్నా మన్మోహన్ సింగే యువకుడు-- అన్నాహజారే[22]
  • కాంగ్రెస్ పాలన తుగ్లక్ పాలన లాగా తయారైంది-- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి[23]
  • మరో జన్మంటూ ఉంటే అందమైన ఆడపిల్లగా పుట్టాలని ఉంది -- ఫరూక్ అబ్దుల్లా (జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి)[24]
  • చంద్రబాబు నాయుడు బుర్ర ట్యూబ్ లైట్ వంటిది-- పొన్నాల లక్ష్మయ్య [25]
  • ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాలు వినోద ఛానెళ్ళకు బాగా సరిపోతాయి -- ఎస్.వై.ఖురేషి (ప్రధాన ఎన్నికల అధికారి)[26]
  • కొందరు రాతి విగ్రహాలను ఇష్టపడతారు, మేము ప్రజలను ఇష్టపడతాము -- అఖిలేష్ యాదవ్ (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)[27]
  • బీసీ మంత్రులు గంగిరెద్దుల్లా తయారౌతున్నారు -- ఆర్.కృష్ణయ్య[28]
  • ప్రస్తుతం మన పాలకులు జిన్నా కంటె ప్రమాదకరులు -- ప్రవీణ్ తొగాడియా (విశ్వహిందూ పరిషత్తు అధ్యక్షుడు)[29]
  • చంద్రబాబు ఓ చచ్చిన పాము, దాన్ని మళ్ళీ మళ్ళీ చంపలేము -- నారాయణ (సీపీఐ కార్యదర్శి)[30]
  • భారతీయ మహిళలకు మరుగుదొడ్ల కంటె సెల్‌ఫోన్లే ముఖ్యం -- జైరాం రమేష్ (కేంద్ర మంత్రి)[31]
  • తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది -- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[32]
  • నన్ను టాయిలెట్ పేపర్‌లా వాడుకున్నారు-- రాయపాటి సాంబశివరావు (గుంటూరు ఎంపి) కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్య [33]
  • తెలంగాణ తెచ్చేది తెరాస, ఇచ్చేది భాజపా, చచ్చేది కాంగ్రెస్ -- విజయశాంతి.


[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 10-05-2012
  2. సాక్షి దినపత్రిక, తేది 08-05-2012
  3. సాక్షి దినపత్రిక, తేది 08-05-2012
  4. ఈనాడు దినపత్రిక, తేది 07-05-2012
  5. ఈనాడు దినపత్రిక, తేది 03-05-2012
  6. సాక్షి దినపత్రిక, తేది 30-04-2012
  7. ఈనాడు దినపత్రిక, తేది 29-04-2012
  8. ఈనాడు దినపత్రిక, తేది 29-04-2012
  9. ఈనాడు దినపత్రిక, తేది 28-04-2012
  10. ఈనాడు దినపత్రిక, తేది 22-04-2012
  11. ఈనాడు దినపత్రిక, తేది 21-04-2012
  12. నమస్తే తెలంగాణ, తేది 20-04-2012
  13. ఈనాడు దినపత్రిక, తేది 16-04-2012
  14. ఈనాడు దినపత్రిక, తేది 14-04-2012
  15. ఈనాడు దినపత్రిక, తేది 04-04-2012
  16. సాక్షి దినపత్రిక, తేది 03-04-2012
  17. సాక్షి దినపత్రిక, తేది 02-04-2012
  18. సాక్షి దినపత్రిక, తేది 31-03-2012
  19. ఈనాడు దినపత్రిక, తేది 30-03-2012
  20. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2012
  21. సాక్షి దినపత్రిక, తేది 28-03-2012
  22. సాక్షి దినపత్రిక, తేది 17-03-2012
  23. సాక్షి దినపత్రిక, తేది 17-03-2012
  24. ఈనాడు దినపత్రిక, తేది 18-03-2012
  25. ఈనాడు దినపత్రిక, తేది 12-03-2012
  26. ఈనాడు దినపత్రిక, తేది 05-03-2012
  27. సాక్షి దినపత్రిక, తేది 07-03-2012
  28. సాక్షి దినపత్రిక, తేది 02-03-2012
  29. ఈనాడు దినపత్రిక, తేది 25-02-2012
  30. సాక్షి దినపత్రిక, తేది 21-02-2012
  31. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 18-02-2012
  32. ఈనాడు దినపత్రిక, తేది 05-02-2012
  33. సాక్షి దినపత్రిక, తేది 22-01-2012
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె