అకీరా కురొసావా
Appearance
అకీరా కురొసావా (మార్చి 23, 1910 - సెప్టెంబరు 6, 1998) జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. 57 సంవత్సరాల కెరీర్ లో 30 చలన చిత్రాలకు దర్శకత్వం వహించిన కురసోవా సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన, ముఖ్యమైన సినీ దర్శకుల్లో ఒకరుగా పేరొందారు. 1936లో కురసోవా జపనీస్ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. కొద్దికాలం పెయింటర్ గా పనిచేశారు. సంవత్సరాల పాటు ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రచయితగా పనిచేశాకా రెండో ప్రపంచ యుద్ధసమయంలో 1943లో పాపులర్ యాక్షన్ సినిమా సాన్షిరో సుగతా (అనే జూడో సాగా) ఆయన దర్శకునిగా తొలి సినిమా చేశారు. [1]
వ్యాఖ్యలు
[మార్చు]- జ్ఞాపకశక్తియే ఊహాశక్తికి దారితీస్తుంది.[2]
- మనిషి కలలు కనే మేధావి. మీ సామర్థ్యం ఏమిటో కలలు కనండి. ఎంత కష్టపడి కలలు కంటే అంత త్వరగా అది నెరవేరుతుంది.
- కళాకారుడి పాత్ర చూపు తిప్పుకోకుండా ఉంటుంది.
- పిచ్చి ప్రపంచంలో పిచ్చివాళ్ళు మాత్రమే బుద్ధిమంతులు.
- ప్రతి విషయాన్ని సూటిగా చూస్తే భయపడాల్సిన పనిలేదు.
- దాని సృష్టికర్త గురించి రచనను మించినది మరొకటి లేదు.
- నేను ఎవరినీ ద్వేషించలేను. నాకు అలాంటి సమయం లేదు.
- నిజం మిస్టరీలో ఉంది.