Jump to content

మనిషి

వికీవ్యాఖ్య నుండి
చావు ఎప్పుడూ బతకాలని చూస్తుంది. బతుకు ఎప్పుడూ చావలని చూస్తుంది. ఈ రెండిటి మధ్య నిరంతరం నలిగిపోయి జీవించే వాడే మనిషి --అజ్ఞాత రచయిత

మనిషి జీవ ప్రపంచంలో అత్యున్నత జీవి. ఏ జీవికి లేని తెలివితేటలు ఇతని సొంతం. తన తెలివితేటలతో అన్ని జీవులను స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ అతి తెలివితేటలే మనిషి వినాశనానికీ దారి చూపుతున్నాయి. కులం, మతం, వర్గం, వర్ణం,ఆశ, నిరాశ, దురాశ, దుఃఖం, సంతోషం ఇలా అనేకం మనిషిని ప్రభావితం చేస్తూ, తన సమూహంతో ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించేలా చేస్తున్నాయి. అలాంటి మనిషిపై పలువురి వ్యాఖ్యలు...

మనిషిపై వ్యాఖ్యలు

[మార్చు]
  • దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
- గురజాడ
  • పోలీసులు ఎంత మంది చనిపోయారు, నక్సల్స్‌ ఎంతమంది చనిపోయారు అని అడగటం కాదు; మనుషులు ఎంతమంది చనిపోయారు అని అడగండి
- సింధూరం
  • మనుషులంతా ఒకటే- కాని ముఖాలు ఒకటి కావు, కొన్ని గోముఖ వ్యాఘ్రాలు, కొన్ని అశ్వముఖ గార్ధభాలు, మరి కొన్ని హరిముఖ జంబుకాలు.---*బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త[1]
  • అసూయ, అత్యాశ, కోపం, పరుషమైన మాట వదిలిపెట్టినవాడే మంచి మనిషి-----తిరుక్కురళ్
  • ప్రపంచంలో గల మేధావులందరికన్నా ఒక మంచి హృదయం గల మనిషి ఎంతో గొప్ప వాడు---లిట్టన్[2]
  • నాణేనికి రెండువైపుల ఒకే మారు చూడాలనుకునే వింతనైజం కల వింతజీవి మనిషి--అజ్ఞాత రచయిత
  • తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా జీవించే మనిషంటే మరీ ఇష్టం---అబ్రహం లింకన్
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.


మూలాలు

[మార్చు]

మూస:మూలాల జాబితా

  1. నవ్య జగత్తు,(అక్కరలేదు కవిత), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్. పుట-120
  2. తెలుగు దివ్వెలు,9 వ తరగతి,తెలుగువాచకం,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,2013, పుట-94
"https://te.wikiquote.org/w/index.php?title=మనిషి&oldid=15953" నుండి వెలికితీశారు