Jump to content

అత్యాశ - ఆశ

వికీవ్యాఖ్య నుండి
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలమా?
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలమా?

దక్కని వాటిని,శక్తికి మించిన వాటిని పొందాలను కోవడం అత్యాశ .దక్కించుకోగలను, పొందగలను అను కొద్దిపాటి నమ్మకాన్ని కలిగివుండటం ఆశ .

ఆశ-అత్యాశలపై వ్యాఖ్యలు[మార్చు]

 • అత్యాశ వున్నచోట ఓటమి వుంటుంది. ........... టి.ఎల్.వాస్వాని.
 • స్వర్గంలో సేవకుడుగా వుండటం కంటే నరకంలో అధికారమే గొప్పది. ....... జాన్ మిల్టన్
 • ఆకాశాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు అదః పాతాళాన్నుంచి మొదలుపెట్టు ..... సైరస్.
 • సాధిద్దామని త్లంపు వున్నపుడు, నీకు కాంక్షే లేనప్పుడు అది అసాధ్యమే అవుతుంది. ...............కాస్టిలెజో.
 • మనసు నిండా ఆశ నింపుకున్నప్పుడే చెయ్యాలనుకున్న పని ప్రారంభించు. ....... అగ్రిప్ప
 • అన్ని ఆశలు ఒకే సారి అడియాశలుకావు. ................. లామింగ్టన్.
 • అత్యూన్నత శిఖరాలకు చేరుకోవాలన్నపుడు ముందుగా నువ్వు రెండో వాడిగానో మూడో వాడిగానో స్థానం సంపాదించు. ....సిసెరో.
 • మనిషిలో నివృత్తి లేని బలహీనత ఒకటుంది: అది ప్రతి మనిషిలో సహజమైన నిరాశ. ......... నెపోలియన్ హిల్.
 • దురాశ, కోపం లాంటి ఆత్మహత్యా సదృశమైన గుణాలు తక్కగపోగా పెరుగుతున్నాయి. ....... కింగ్స్ లీ అమిస్.
 • మనిషి ప్రథాన శత్రువు అత్యాశ. ................ హెంరీ థామస్.
 • పిసినారి తనకు లేని దానికోసమే కాదు తనకు వున్నది కూడ మరింత కావాలనుకుంటాడు. ...........సైరస్.
 • వ్యాధి గ్రస్తుడు జీవించి వున్నంత వరకు ఆశ వుంటుంది. ........సినెరో
 • మనల్ని నడిపేది ఆశ మాత్రమే. ...... కాఫ్ మాన్
 • ఆశ లేనప్పుడు భయమెందుకు? ...... జాన్ మిల్టన్
 • మంచి కోసమ్ం ఆశపడు కాని, కష్టానికి కూడ సిద్ధంగా వుండు. ... ఇంగ్లీష్ సామెత
 • మానవ మేధస్సు సుఖాన్నుండి సుఖానికి కాక ఆశ నుండి ఆశ వైపు ప్రయాణిస్తుంది. ...... శామ్యూల్ జాన్సన్
 • పళ్ళూడి పోతాయి, జుట్టు తెల్లబడుతుంది. సాధ్యం కాదని తెలిసినా మనిషి ఆశతో వేళ్ళాడుతూనె వుంటాడు. ..... రవీంద్ర నాద్ టాగూర్
 • ఆశ పేదవాడి రొట్టె ముక్క. ....మలెటన్
 • ఆశ ఓ ఔషదం. అది అంతర్గగ శక్తినిస్తుంది. విన్సెట్ ఫీల్
 • పేదవాడికి ఆశే గొప్ప సహాయ కారి. ....... శామ్యూల్ సైటల్స్
 • అత్యాశ అతి కష్టాలలో ఉద్భవిస్తుంది. ...... రస్సెల్
 • ఆశ ఓ పగటి కల. ...... ఆరిస్టటిల్
 • ఆశే లేకుంటే హృదయం బద్దలవుతుంది. .... థామస్ పుల్లర్
 • తన ఆశల్ని తీర్చు కోవడం ద్వారా కానీ, తగ్గించు కోవడము ద్వారా కాని శాంతి లభిస్తుంది. .........గోథే
 • మనకున్న అన్ని ఆశలు మనకు తెలియక పోవడం మంచిది. .....రోచ్ పోకాల్డ్
 • ఆశ తర్కానికి అందనిది. .......నార్మన్ కజిన్స్
 • ఆశ వున్నచోట మంచి ఆలోచనలుంటాయి. ..హెన్రీ మిల్లర్
 • ఆశ మేలుకొంటున్న స్వప్నం. ............ ఆరిస్టటిల్
 • ఆశలేని ప్రాణి అణగారిపోదుంది. ఆశ చంపు కోవడం ఆత్మ హత్య. ... నార్ల వెంకటేశ్వర రావు
 • కష్టాల్లో వున్న వారికి ఆశే ఔషదం. ........ షేక్స్పీయర్
 • మనలో ఎదో కోల్పోయం. అదే ఆశ ..............ఆస్కార్ వైల్డ్
 • ఆశలేని చోట కృషి లోపిస్తుంది. ..... శామ్యూల్ జాంసన్
 • నీలో ఆశ అంతరించిన తర్వాత ఇంకొకరి గురించి పిర్యాదులెందుకు? ...... గాలిబ్
 • రాత్రివేళ సూర్యుడు కనిపించలేదని నిరాశ చెందితే నక్షత్రాలూ కనిపించవు. ..... రవీంద్ర నాథ్ టాగూర్
 • ఎన్నడు ఆశపడనివాడు ఎప్పుడు నిరాశ చెందడు. జి.బి.షా
 • ఆశలేని వారికి అగచాట్లు వుండవు. ........ విశ్వనాథ సత్యనారాయణ
"https://te.wikiquote.org/w/index.php?title=అత్యాశ_-_ఆశ&oldid=13766" నుండి వెలికితీశారు