అమ్మ
స్వరూపం
సృష్టికి మూలం అమ్మ . అమ్మలేనిదే జీవితం లేదు. అన్నిచోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించాడు .
Comments on Amma
[మార్చు]- The mother of the tree of life. Hghug
సినిమా పాటల్లో అమ్మ
[మార్చు]- అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే --ఆత్రేయ
- పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా --చంద్రబోస్
- అమ్మను మించి దైవమున్నదా... ఆత్మను మించి అర్థమున్నదా... --సినారె
- అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే... అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే...
- ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల
కవితల్లో అమ్మ
[మార్చు]- తల్లి యొకతే సాకు తనయు లంబదిమంది-ఉంగలోన ప్రేమ రంగరించి/ తల్లి యొకతే బరువు తనయులెందరికైన...--నార్ల వెంకటేశ్వరరావు
- పోగులుగా విడిపోతున్న స్మృతి ముద్రను మనసు చట్రంలో పొదుగుకొని/ అమ్మ రూపం నిలుపుకుంటాను/ జన్మమూలం పదిల పరుచుకుంటాను.--సి.నారాయణరెడ్డి
అమ్మపై ఉన్న సామెతలు
[మార్చు]- అడగందే అమ్మ అయినా పెట్టదు
- అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
- కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
- ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
- తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.
- తల్లి పుట్టిల్లు మేనమామ కెరుకే
- కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
- అమ్మ కడుపు చూస్తుంది.... ఆలి జేబు చూస్తుంది.
==తల్లి== వ్యాఖ్యలు
- తన తల్లిని లాగే బాలుడ్ని కూడ ఎవరు అపార్థం చేసుకోము. ..... నార్నన్ డగ్లాస్
- తన పిల్లల్ని గురించి తల్లి గొప్ప భవిష్యత్తుని కలలు కంటుంది. ....హెచ్.టి.హెన్రీ
- తల్లి అర్థం చేసుకున్నట్లు తండ్రి అర్థం చేసుకోడు .............అస్కార్ వైల్డ్
- ప్రేమించే స్త్రీ లాంటి బానిస లేదు. ప్రేమిస్తే ఎవరిలోనూ తల్లలాంటి బానిస లేదు....బీచర్
- తల్లిని తండ్రి గౌరవించు. ....................... బైబిల్
- తల్లిని మించిన దైవము లేదు ................తెలుగు నానుడి
- తల్లి కొడుకు కడుపును చూస్తుంది.... భార్య జేబులు చూస్తుంది .....తెలుగులో ఒక సామెత
- పిల్లవాడికి తల్లి ఎంతటి మనిషికంటే దైవంకంటే ఎక్కువ --- ఇప్పటికి... ఎప్పటికి. హడ్సన్
- తల్లి ఆహారంకంటే ప్రేమను కోరుకుంటుంది............ఎర్మినియో
- తల్లి ఎంత వయసులో వున్నా మధ్యవయస్సున్న కొడుకుని కూడ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. స్కాట్ మాక్సవెల్
- దేవుడు ప్రతిచోట వుండలేడు. అందుకే తల్లిని సృష్టించాడు.. జ్యూయిష్ సామెత
- చిన్నపిల్లల హృదయములోపెదాల్లో తల్లే దేవుడు....థాకరే
- తల్లి నిజమైన తల్లే; అయితే ఎప్పటికీ స్వేచ్చాజీవికాదు..............బాల్జాక్
- తల్లిలేని ఇల్లేనా? తల్లి అభిమానం మాటల్లో వర్ణించలేము.......ఎమర్సన్
- మనిషి తన తల్లి ఎలా తయారుచేస్తే అలా తయారవుతాడు.......ఎమర్సన్
- ప్రతి స్త్రీ తన తల్లిలాగే మారుతుంది. అది వారి విషాదం. పురుషుడు అలా కాదు. అది అతని స్వంతం.ఆస్కార్ వైల్డ్
- తల్లి అనేది అలౌకిక వక్తీకరణ. మానవ జాతికే పరిమితం కాదు...... డికిన్ సన్
- నేను నాఆశలు నేను దేవత లాంటి తల్లికి ఋణపడి వుంటాను. ....అబ్రహాం లింకన్
- తల్లే ప్రథమ గురువు......................తెలుగు నానుడి