Jump to content

అలెగ్జాండర్

వికీవ్యాఖ్య నుండి
అలెగ్జాండర్

అలెగ్జాండర్ (సా.పూ[నోట్స్ 1] 356 జూలై 20/21 - సా.పూ 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని బాసిలియస్ అంటారు), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III అని, అలెగ్జాండర్ ది గ్రేట్ (గ్రీకులో అలెగ్జాండ్రోస్ హో మెగాస్) అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, గ్రీస్ నుండి వాయవ్య భారతదేశం వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. [1]


వ్యాఖ్యలు

[మార్చు]
  • ప్రయత్నించే వాడికి సాధ్యం కానిది ఏదీ లేదు.[2]
  • గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి ప్రవర్తన అందరి భవితవ్యంపై ఆధారపడి ఉంటుంది.
  • నా వంతుగా, నేను ఆయుధాల కంటే తత్వశాస్త్రం అత్యున్నత రహస్యాల జ్ఞానంలో రాణించడానికి ఇష్టపడతాను.
  • సైనికులారా, ఈ మధ్య కొంతమంది నిస్సహాయుల ప్రయత్నంతో మీ నుండి లాక్కోవాలనిపించింది, కాని దేవతల దయ, ఆశీర్వాదం వల్ల, నేను ఇప్పటికీ సంరక్షించబడుతున్నాను.
  • మా నాన్న అన్నీ ముందే ఊహించి ఉంటారు. గొప్ప, అద్భుతమైన పని చేయడానికి అతను మీకు, నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వడు.
  • ఏథెన్స్ లో మంచి పేరు సంపాదించడానికి నేను ఎదుర్కొనే ప్రమాదాలు ఎంత పెద్దవి.
  • నేను అలెగ్జాండర్ కాకపోతే, నేను డయోజెనెస్ అయ్యేవాడిని.


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.