దయ

వికీవ్యాఖ్య నుండి

దయ మీద వ్యాఖ్యలు[మార్చు]

  • అపరిచితులతో కూడా దయతో, విధేయతతో వ్యవహరిస్తే అతడు ప్రపంచ పౌరుడి క్రింద లెక్కే - ఫ్రాన్సిస్ బేకన్
  • దయ తన కుటుంబం మీద అయితే స్వార్ధం అవుతుంది. దయ గౌరవప్రదమే కానీ కక్ష కాదు - షేక్స్పియర్
  • తోటి వారిని సేవించడము మన ప్రేమతో కూడిన దయకు గుర్తింపు. ......... మాస్ మాన్
  • దయ సమాజాన్ని ఏకీకృతం చేసే బంగారు గొలుసు. .................. గధే
  • దయ దయకు మాతృక. ........................సోపోక్లిన్
  • సత్య సంధులైన రాజకీయ వేత్తలు దయామయులై వుంటారు. ........... మస్కరావ్ హెస్
  • మాటల్లో దయ నమ్మకము కల్గిస్తుంది; అలోచనలో దయ మిక్కిలి నమ్మకాన్నిస్తుంది. .....ఇవ్వడములో దయ ప్రేమనిస్తుంది. లాట్జు
  • దయను ఎలా తిరస్కరించాలో నేర్చుకో. అదొక గొప్పకైన కళ. .......... థామస్ పుల్లర్
  • దయగా పొందవలసిన దాన్ని హక్కుగా పరిగణించకు. ...........కోలిన్స్
  • సర్వ భూతాల పట్ల దయగలవాడు దేవుని కృపకు పాతృడు. ............జీసస్
  • ఎందరో దేవుళ్ళు, ఎన్నో మతాలు, ఎన్నో మార్గాలు. అయితే భాదాతాప్త ప్రపంచానికి కావలసింది మాత్రము దయే. ... విల్ కాక్స్
  • అపరిచితులతో కూడా దయతో, విధేయతతో వ్వవహరిస్తే అతడు ప్రపంచ పౌరిడి క్రింద లెక్కే. ........... ప్రాన్సిస్ బేకన్
  • నిరుపేదకు ఒక నాణెం దానం చేస్తే ఆరు ఆశిస్సులు లభిస్తాయి. అయితే అతనితో దయతో మాట్లాడితే పదకొండు ఆశిస్సులు లభిస్తాయి. లూత్ ముద్
  • దయను ఎదిరించగల ఖడ్గం లేదు. ..........జపనీస్ సామెత
  • గర్విష్టి అయిన తెలివైన వాడిగా ఉండటము కంటే దయగల మూర్ఖుడుగా వుండతము మెరుగు. ఆంగ్ల సామెత
  • తల్లిదండ్రుల మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టితేనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టాదా?? వేమన
  • తల్లి తండ్రి, సోదరి సోదరుడు, భార్యాభర్త. బిడ్డలు, చుట్టాలు అను బంధుప్రేమయే "మాయ" సర్వజీవుల యెడలను సమమైప్రవహించు అనురాగమును "దయ" అందురు. - రామకృష్ణ పరమహంస

కీర్తనలు, పాటలు[మార్చు]

  • నీ దయ రాదా రామ నీ దయ రాదా... w:పూజ సినిమా కోస>
  • ఏ తీరుగ నను దయ చూచెదవో... w:రామదాసు కీర్తన.

మూలాలు[మార్చు]

  • సూక్తి సింధు.
"https://te.wikiquote.org/w/index.php?title=దయ&oldid=17110" నుండి వెలికితీశారు