Jump to content

ఆడం స్మిత్

వికీవ్యాఖ్య నుండి
ఆడం స్మిత్

అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడంస్మిత్ (Adam Smith) 1723, జూన్ 16న స్కాట్లాండ్ లోని కిర్‌కాల్డిలో జన్మించాడు. ఇతడు బ్రిటన్ దేశానికి చెందిన తత్వవేత్త, ఆర్థికవేత్త. 1776లో రచించిన వెల్త్ ఆప్ నేషన్స్ గ్రంథం వల్ల ప్రసిద్ధి చెందినాడు. సంప్రదాయ ఆర్థికవేత్త అయిన ఆడం స్మిత్ స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడి దారీ విధానం, లిబర్టిలిజం లపై అనేక రచనలు చేసాడు. అరిస్టాటిల్, హాబ్స్, జాన్ లాక్, ఫ్రాంకోయిస్ కేనే మొదలగు వారి వల్ల ప్రభావితుడైనాడు. [1]

వ్యాఖ్యలు

[మార్చు]
  • ఏ దేశపు భూమి అయినా ప్రయివేటు ఆస్తిగా మారిన వెంటనే, భూస్వాములు, అందరు మనుషుల్లాగే, తాము ఎన్నడూ నాటని చోట కోయడానికి ఇష్టపడతారు, దాని సహజ ఉత్పత్తులకు కూడా అద్దె డిమాండ్ చేస్తారు.[2]
  • ఆరోగ్య౦గా, అప్పుల్లో కూరుకుపోయి, స్పష్టమైన మనస్సాక్షిగల వ్యక్తి స౦తోషానికి ఏమి జోడిస్తారు?
  • పేదల అసలైన విషాదం వారి ఆకాంక్షల పేదరికం.
  • డబ్బు అంతా నమ్మకానికి సంబంధించిన విషయమే.
  • మానవత్వం స్త్రీ ధర్మం, ఉదారత పురుషుని ధర్మం.


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.