Jump to content

ఇందిరా గాంధీ

వికీవ్యాఖ్య నుండి
మహాత్మా గాంధీతో ఇందిరాగాంధీ

భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ నవంబర్ 19, 1917న జన్మించింది. తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం 1964లో రాజ్యసభకు ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ప్రసారశాఖామంత్రిగా పనిచేసింది. శాస్త్రి మరణం అనంతరం ఇందిర 1966 నుంచి 1977 వరకు మళ్ళీ 1980 నుంచి అక్టోబర్ 31, 1984న మరణించేవరకు పదవిలో కొనసాగింది.


ఇందిరాగాoది.యొక్క ముఖ్య కొటేషన్లు

[మార్చు]
  • గరీబీ హటావో.
  • నిజాయితీ గల ధైర్యవంతులకు క్షమాగుణం ఉంటుంది.
  • మా తాతగారు ఒకసారి నాతో ఇలా అన్నారు: పని చేసేవారు, క్రెడిట్ తీసుకునేవారు అని. మొదటి గ్రూపులో ఉండటానికి ప్రయత్నించమని అతను నాకు చెప్పాడు; చాలా తక్కువ పోటీ ఉండేది.
  • అవకాశాలు ఇవ్వరు. వాటిని కైవసం చేసుకోవాలి, పని చేయాలి. ఇది పట్టుదలకు, ధైర్యానికి పిలుపునిస్తుంది.
  • నా జీవితమంతా నా ప్రజల సేవలో గడిపినందుకు గర్వపడుతున్నాను... నా చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటాను, చనిపోయాక నా ప్రతి రక్తపు బొట్టు భారతదేశాన్ని ఉత్తేజపరుస్తుందని, బలోపేతం చేస్తుందని చెప్పగలను.
  • జీవితం యొక్క ఉద్దేశ్యం నమ్మకం, ఆశ, కృషి.
  • మహిళలు కొన్నిసార్లు చాలా దూరం వెళతారు, ఇది నిజం. కానీ మీరు చాలా దూరం వెళ్ళినప్పుడు మాత్రమే ఇతరులు వింటారు.
  • మీరు ఒక అడుగు ముందుకు వేసినప్పుడల్లా, మీరు ఏదో ఒకదాన్ని ఇబ్బంది పెట్టడం ఖాయం.
  • క్షమించడం ధైర్యవంతుల ధర్మం.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.