ఎర్రన
స్వరూపం
ఎర్రన లేదా ఎర్రా ప్రగడ కవిత్రయంలో రెండవవాడు. నన్నయ అసంపూర్తిగా వదలివేసిన అరణ్య పర్వాన్ని తెలిగించాడు.
నన్నయ చివరి పద్యంలో శరద్రాత్రుల వర్ణన జరిగింది. అదే వర్ణనను ఎర్రన కొనసాగించాడు. ఇది ఎర్రన భారతాంధ్రీకరణలో మొదటి పద్యం
- స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
- వరణములై దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, మ
- ద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ
- గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళఁ జూడగన్
ఈ పద్యంలో శారద రాత్రుల వర్ణనతో పాటు ముందు ముందు దుర్యోధనాదులకు సంభవించే పరాభవాలు సైతం గర్భితంగా ఉన్నట్లు పండితులంటారు. అవమానాలకు గురైన దుర్యోధనాదులను పాండవులు విముక్తి చేయడాన్ని కూడా ఇందులో ఎర్రన పొందుపరచాడంటారు.
మహాభారతాంతర్గతంగా ఎర్రన చేసిన సరస్వతీ స్తుతి. తెలుగు కవుల అనేక సరస్వతీ ప్రార్ధనలలో ఉత్తమమైన వానిలో ఇది ఒకటి. పోతన వంటి తరువాతి కవుల స్తుతులకు మార్గదర్శి.