కవిత్వం
Jump to navigation
Jump to search

ఒకరు రాయమంటే
రాయునది కవిత్వం కాజాలదు
ఆకలియే కవిత్వం
ఆలోచనయే కవిత్వం
కదిలించే ఘటనలు
కవ్వించే ప్రతినలు
కవితకు ప్రతిపాదికలు
నిగూడతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా, మనసును రంజింపజేయుటకు, ఆలోచింపచేయుటకు చేయు రచన కవిత్వం.
కవిత్వంపై గల వ్యాఖ్యలు[మార్చు]
- కవిత్వ మొక తీరని దాహం --శ్రీశ్రీ
- ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే--శ్రీశ్రీ
- వడగాడ్పు నా జీవితం. వెన్నెల నా కవిత్వం --గుర్రం జాషువా
- అబద్ధాలాడడమంత సులభం అవదు సుమూ! కవిత అల్లడం---దాశరథి కృష్ణమాచార్య[2]
ఇవీ చూడండి[మార్చు]
- శ్రీశ్రీ వ్యాఖ్యలు
- గుర్రం జాషువా వ్యాఖ్యలు
- బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త వ్యాఖ్యలు
- దాశరథి కృష్ణమాచార్య వ్యాఖ్యలు
- సర్దేశాయి తిరుమలరావు వ్యాఖ్యలు