Jump to content

శ్రీశ్రీ

వికీవ్యాఖ్య నుండి
శ్రీశ్రీ
శ్రీశ్రీ

శ్రీశ్రీ (జనవరి 2, 1910 — జూన్ 15, 1983), ప్రముఖ అభ్యుదయ తెలుగు కవి, సినిమా గీతరచయిత. ఇతని పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాస రావు.

శ్రీశ్రీ యొక్క ముఖ్య వ్యాఖ్యలు

[మార్చు]

చరిత్ర గురించి

[మార్చు]
  • ఆ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడి కైన ఖర్చులు, మతలబులు, కైఫీయతులు, ఇవి కాదోయ్‌ చరిత్ర సారం.
  • ఏ దేశపు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం
  • ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు?
  • తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?

కవిత్వం గురించి

[మార్చు]
  • కాదేదీ కవితకనర్హం
  • ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్న మాటే.
  • కవిత్వమొక తీరని దాహం
  • హీనంగా చూడకు దేన్నీ, కవితామయమోయ్ అన్నీ.

వ్యక్తులపై

[మార్చు]
  • కొంతమంది యువకులు పుట్టుకతో వృధ్ధులు
  • వ్యక్తికి బహువచనం శక్తి
  • బానిసకొక, బానిసకొక, బానిసకొక బానిస (జలగం వెంగళరావుపై శ్రీశ్రీ విమర్శ)
  • వేయిపడగలు, లక్ష పిడకలు, కాగితప్పడవలు, చాదస్తపు గొడవలు. (విశ్వనాథ సత్యనారాయణ యొక్క వేయిపడగలు రచనపై చేసిన వ్యాఖ్య)
  • పడిపోయిన ప్రకాసురుడి పాత ప్రభుత గుడ్డిది, నిజానికది కాంగిరెద్దు నీలం సంజీవరెడ్డిది[1](టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వంపై వ్యాఖ్య)

ఇతరాలు

[మార్చు]
  • కటుకథకూ, పెట్టుబడికీ పుట్టిన విషపుత్రికలు (మీడియాపై చేసిన వ్యాఖ్య)
  • పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి.
  • ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం
  • శోధించి సాధించాలి అదియే ధీరగుణం.
  • హింస తోనే సృష్టి పూస్తది; హింస తోనే మార్పు వస్తది
  • మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను.
  • ఈ జన్మను సద్వినియోగం చేసుకోవడం చేతకాక లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం.
  • న్యాయం గెలుస్తుందన్నమాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
  • ముందు దగా, వెనుక దగా, కుడిఎడమల దగాదగా.

సినిమా పాటలు

[మార్చు]
  • ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా - భూమి కోసం
  • కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు - వెలుగునీడలు
  • తెలుగువీర లేవరా...దీక్షబూని సాగరా...దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా - అల్లూరి సీతారామరాజు
  • మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము - డాక్టర్ చక్రవర్తి

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. అనంతం:శ్రీశ్రీ, శ్రీశ్రీ ప్రచురణలు, చెన్నై,మే-2000, పుట-192
"https://te.wikiquote.org/w/index.php?title=శ్రీశ్రీ&oldid=13146" నుండి వెలికితీశారు