Jump to content

కుక్క

వికీవ్యాఖ్య నుండి

కుక్క (Dog) మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషి తో కలిసి జీవించడం నేర్చుకుంది.

కుక్కపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు]
  • కుక్క పిల్ల, అగ్గి పుల్ల కాదేదీ కవితకనర్హం.
  • ఎండ కాస్తూ వర్షం కురిస్తే ..... కుక్కలకు, నక్కలకు పెళ్ళి అంటారు.

కుక్క పై ఉన్న సామెతలు:

[మార్చు]
  • అరిచే కుక్క కరవదు
  • కుక్క కాటుకి చెప్పుదెబ్బ.
  • కుక్క తోక వంకర
  • కుక్కలు చింపిన విస్తరి లాగా
  • కుక్కలుండే ఊరికి నక్కే పోతురాజు.
  • తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు.
  • పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది.
  • మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు.
  • శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట.
  • కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
  • కుక్క తోక పట్టి గోదారి ఈదినట్టు
  • కుక్క తోత వంకర అన్నట్టు...
  • కనకపు సింహాసనమున శునకమును కూర్చోండపెట్టినట్లు
  • చంద్రుని చూసి కుక్కలు మొరిగినట్లు
  • చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా....
  • నల్లటి కుక్కకు నాలుగు చెవులు
  • దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు
  • గడ్డి వామి దగ్గర కుక్కను కాపలా పెట్టి నట్లు. అది తినదు.... ఆవును తిననీయదు.
  • ఊర్లో పెళ్ళికి కుక్కల హడా విడి ఎక్కువ.
  • కుక్క పని గాడిద చేసి చావు దెబ్బలు తిన్నట్టు
  • కుక్కకు విశ్వాస మైనా వుంది.... నీకు అదీ లేదు.
  • చెట్టు చెడుకాలానికి కుక్క మూతి పిందెలు కాసినట్లు.
  • కుక్క వస్తే రాయి దొరకదు.... రాయి దొరికితే కుక్క రాదు.
  • ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లు.
  • మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట.
  • కుందేలును లేవదోలి కుక్క ఏరగను పోయిందట.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=కుక్క&oldid=17050" నుండి వెలికితీశారు