తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్
- ఆదర్శం*
ఈలోకంలో ప్రతీదీ నాకు ఆదర్శమే...
పడగొట్టిన వాడిపైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకుని మరో గూడు కట్టుకునే "సాలెపురుగు" నాకు ఆదర్శం...
ఎన్ని సార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేచే "అలలు" నాకు ఆదర్శం...
మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే "మొక్క" నాకు ఆదర్శం...
ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే "బాణం" నాకు ఆదర్శం...
ప్రత్యర్ధి పెద్దవాడైనా సరే సూర్యుడిని సైతం కప్పి వర్షించే "మేఘాలు" నాకు ఆదర్శం...
అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే "గాలిపటం" నాకు ఆదర్శం...
బురదలో ఉన్నా తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే "కమలం" నాకు ఆదర్శం...
ఎంతటి వేడిని అయినా తాను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే "చెట్టు" నాకు ఆదర్శం...
లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే "సూర్యుడు" నాకు ఆదర్శం...
తను ఎంత చిన్నదైనా తన వంతుగా ప్రాణికోటి దాహాన్ని తీర్చే "చినుకు" నాకు ఆదర్శం...
చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే "చంద్రుడు" నాకు ఆదర్శం...
ఒక్క సారి అన్నం పెడితే జన్మంత విశ్వాసంగా ఉండే "శునకం" నాకు ఆదర్శం...
జీవించేది కొంత కాలమైనా అనుక్షణం ఆనందంగా ఉండే "సీతాకోకచిలుక" నాకు ఆదర్శం...
ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తీసుకునే
"హంస" నాకు ఆదర్శం...!!!
అందుకే చెబుతారు ప్రతిదానిలో/ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక విశేష గుణం /మంచి గుణం ఉంటుంది , మంచిని చూసేది అలవాటు చేసుకుంటే మన దగ్గర అన్నీ మంచి గుణాలు మాత్రమే ఉంటాయి.
LAXMAN DL (చర్చ) 06:15, 28 ఫిబ్రవరి 2020 (UTC)LAXMAN DLLAXMAN DL (చర్చ) 06:15, 28 ఫిబ్రవరి 2020 (UTC) 🌹🌹🌹🌹🌹🌹🌹🌹