త్రివిక్రం శ్రీనివాస్
త్రివిక్రం శ్రీనివాస్ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు.
సంభాషణలు
[మార్చు]చిరునవ్వుతో
[మార్చు]- వేణు (వేణు తొట్టెంపూడి)
- వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు ఐపోయినట్టు ఫెయిల్ అయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు.
- మేజర్ పాత్ర(నూతన్ ప్రసాద్)
- ప్రేమికుడు . సైనికుడు దేనికి భయపడకూడదు.
నువ్వేకావాలి
[మార్చు]- వర్ష
- విడిపోవడం తప్పదు అన్నప్పుడు అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.
- మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా ఉండడం చాలా కష్టం.
నువ్వు నాకు నచ్చావ్
[మార్చు]- వెంకీ (వెంకటేష్)
- మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు లేనప్పుడు.. ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు.
- సుజాత (సుహాసిని)
- మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి.. సంప్రదాయాలు పుట్టాకా మనుషులు పుట్టలేదు.
- శేఖర్
- బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అనవసరం.
- అమ్మ కవిత
రాసుకోవడానికి పెన్నిచ్చావు
గీసుకోవడానికి గడ్డమిచ్చావు
ఎందుకమ్మ ఇంత త్వరగా చచ్చావు
మన్మధుడు
[మార్చు]- అభి తాతయ్య(బాలయ్య)
- ఆడపిల్లలు.. ఎంత తేలిగ్గా ప్రేమిస్తారో అంత తొందరగా మర్చిపోతారు.
వాసు
[మార్చు]- గోపాల్‌రావు (విజయ్ కుమార్)
- తండ్రికీ, భవిష్యత్తుకీ భయపడనివాడు జీవితంలో పైకి రాలేడు.
మల్లీశ్వరి
[మార్చు]- వరప్రసాద్ (వెంకటేష్)
- నువ్వు పనిమనిషి అంటున్నావు, నేను పని తెలిసిన మనిషి అంటున్నాను. ఆడపిల్లకి గుణాన్ని మించిన ఆస్తి లేదు.
- పనిచేసి జీతం అడగొచ్చు. అప్పు ఇచ్చి వడ్డీ అడగొచ్చు. కానీ హెల్ప్ చేసి మాత్రం థాంక్స్ అడగకూడదు.
నువ్వే నువ్వే
[మార్చు]- రిషి (తరుణ్)
- మనం తప్పు చేస్తున్నామో, రైట్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది. మనకు మాత్రమే తెలుస్తుంది.
- ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుని కూడా మనం క్షమించగలగాలి.
- అమ్మ, ఆవకాయ్, అంజలి ఎప్పుడూ బోర్ కొట్టరు.
- తాజ్‌మహల్ చూడాలనుకోవాలి. అందులో ఉండాలనుకోకూడదు.
- రిషి తండ్రి (చంద్రమోహన్)
- సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు.
అతడు
[మార్చు]- పార్థు అలియాస్ నందు(మహేష్ బాబు)
- గన్ చూడాలనుకోండి తప్పులేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు చచ్చిపోతారు.
- మనం రోజూ వెన్నెలని చూస్తాం పూరీ. ఎప్పుడో ఒక్కసారే బావుందనిపిస్తుంది. కానీ రోజూ అదలానే వుంటుంది. తేడా అక్కడ లేదు. (గుండె వైపు చూపుతూ) ఇక్కడ వుంది.
- నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.
- మనల్ని చంపాలనుకునేవాళ్ళని చంపడం యుద్ధం. మనల్ని కావాలనుకునేవాళ్ళని చంపడం నేరం. మనల్ని మోసం చెయ్యాలనుకునేవాళ్ళని చంపడం న్యాయం.
- నాయుడు(తనికెళ్ళ భరణి)
- ఎవడైనా గట్టిగా కొడతాడు వీడేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.
- రమణ (సునీల్)
- దయ్యం కంటే భయం మాచెడ్డది కదండీ.
ఖలేజా
[మార్చు]- పాళి ఊరిపెద్ద(రావు రమేష్)
- అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించలేరు.. జరిగాకా ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే దేవుడివని నువ్వు నమ్మే పనిలేదు, మాకు నమ్మించాల్సిన అక్కరాలేదు. సామీ! ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం.
జల్సా
[మార్చు]- సంజయ్ సాహు (పవన్ కళ్యాణ్)
- యుద్ధంలో గెలవడం అంటే శత్రవుని చంపడం కాదు.. ఓడించడం. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం చంపడం కాదు.
- ఆకలేస్తున్నప్పుడు అన్నం ఉండి కూడా తినకపోవడమే ఉపవాసం.. నిద్ర వస్తున్నప్పుడు కళ్ళాదురుగా మంచం ఉండి నిద్రపోకపోవడమే జాగారం.. మన చేతిలో ఆయుధం ఉండీ మన ఎదురుగా శత్రువు ఉన్నా చంపకపోవడం మానవత్వం. ఆ మానవత్వం నాకు వుంది. నీకు వుందా?
- దామోదర్‌రెడ్డి
- బెదిరింపుకి భాష అవసరం లేదు. అర్థమైపోతుంది.
- మనకి వస్తే కష్టం. మనకి కావాల్సినవాళ్లకి వస్తే నరకం.
తీన్‌మార్
[మార్చు]- అర్జున్ పాల్వాయ్ (పవన్ కళ్యాణ్)
- కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం.
- (లాఠీఛార్జి చేస్తున్న పోలీసులకు) దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష - భయం. అది మాకే కాదు, మీక్కూడా వుంటుంది.
జులాయి
[మార్చు]- శంకర్ నారాయణ్ (అల్లు అర్జున్)
- మనం ఇష్టంగా కోరుకున్నది అదృష్టం, బలంగా కోరుకున్నది భవిష్యత్తు.
- ఆశ కేన్సర్ ఉన్నవాణ్ణి కూడా బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నవాణ్ణి కూడా చంపేస్తుంది.
- భయపడడంలోనే పడడం ఉంది. మనం పడొద్దు, లేద్దాం.
- లాజిక్‌లు ఎవరూ నమ్మరు, మేజిక్కులే నమ్ముతారు. అందుకే మన దేశంలో సైంటిస్టుల కన్నా బాబాలే ఫేమస్.
- శంకర్ నారాయణ్ తండ్రి (తనికెళ్ళ భరణి)
- ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవీ.. ఒక్కరాత్రి పందెం కడితే ప్రాణాల కోసం పోరాడే పరిస్థితి వచ్చింది. యుద్ధం తప్పదనుకుంటే యుద్ధం చెయ్. కానీ ప్రాణాల కోసం కాదు అమాయకంగా తాము దాచుకున్న డబ్బులు బ్యాంకులో వేసుకున్నవాళ్ళు, నాలాంటి వాళ్ళ డబ్బు కోసం చెయ్‌రా.
- 100 మైళ్ళ వేగంతో వెళ్ళే ట్రైన్ ప్లాట్‌ఫాం మీద ఆగదని తెలిసుకునేంత తెలివైనవాడివి మూడు నెలల్లో సంపాదించాల్సిన లక్షరూపాయలు ఒక్క రాత్రిలో సంపాదిస్తే నాకు 70 ఏళ్ళకి రావాల్సిన గుండెనొప్పి 50 ఏళ్ళకే వచ్చేస్తుందని తెలియదురా?
అత్తారింటికి దారేది
[మార్చు]- గౌతమ్ నందా అలియాస్ సిద్ధు (పవన్ కళ్యాణ్)
- బాగుండడం అంటే బాగా వుండడం కాదత్తా, నలుగురితో వుండడం నవ్వుతూ వుండడం.
- శేఖర్ (రావు రమేష్)
- తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది.
- ఎం.ఎస్.నారాయణ పాత్ర
- ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.
వ్యాఖ్యలు
[మార్చు]- రెండు దేశాల ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకుంటే కోపాలు తగ్గిపోతాయి.. శాంతి చోటుచేసుకుంటుంది. మాటలు దేశాల మధ్య శత్రుత్వం చెరిపేశాయంటే.. అంతకంటే గొప్ప గుణం వుంటుందా?
- ప్రళయం అంటే ఏదో 2012 సినిమాలో చూసినట్టు సముద్రాలు పొంగి, నగరాలు ముంచేట్టేసి , దాని మీద ఒక వట పత్రం , దాని మీద కృష్ణుడు ..ఇలాంటి imaginations మాత్రం పెట్టుకోకండి ..అలాంటివి ఏవి జరగవు, నాకు తెలిసి జనం పిచ్చోళ్ళు అయిపోయి , psychiatry లో సైతం మందులు దొరక్క జనం చచ్చిపోతారు .. నాకు తెలిసి ఇదే ప్రళయం అంటే