Jump to content

యుద్ధం

వికీవ్యాఖ్య నుండి

యుద్ధం లేదా సంగ్రామం రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు, సంస్థలు, లేదా దేశాల మధ్య పెద్ద యెత్తున జరిగే ఘర్షణ. మానవ సమాజంలో యుద్ధాలు అనాదిగా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర పూర్వ యుగంలో తెగల మధ్య జరిగిన కొట్లాటల నుండి తరువాత నగరాల మధ్య లేదా దేశాల మధ్య లేదా సామ్రాజ్యాల మధ్య అనేక రకాలుగా ఈ ఘర్షణలు జరిగాయి, జరుగుతున్నాయి. "యుద్ధం" అనే పదాన్ని దేశాల మధ్య జరిగే సాయుధ పోరాటాలకే పరిమితంగా వాడడం లేదు. "మతోన్మాదం పై యుద్ధం", "ఉగ్రవాదంపై యుద్ధం", "దారిద్ర్యంపై యుద్ధం", "అవినీతిపై యుద్ధం" వంటి అనేక సందర్భాలలో "యుద్ధం" అనే పదాన్ని వాడుతారు.

యుద్దం గురించి వ్యాఖ్యలు

[మార్చు]
  • యుద్దతంత్రం అంతా మభ్యపుచ్చడంపైనే ఆధారపడివుంది. మనం దాడిచేసే సామర్థ్యంతో ఉన్నప్పుడు చేయలేనట్టుగా కనిపించాలి; మన బలగాలను వినియోగిస్తున్నప్పుడు, నిస్తేజంగా కనిపించాలి; మనం దగ్గరగా ఉన్నప్పుడు, మన శత్రువు మనం దూరంగా ఉన్నామని నమ్మేలా చేయాలి; మనం దూరంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నామని నమ్మించాలి.
  • శాంతిని కోరుకునేవారు యుద్ధానికి సిద్ధం కావాల్సివుంటుంది.
    • వెగెటియుస్, క్రీ.శ.4వ శతాబ్ది.
  • యుద్ధం లేకుంటే మానవులు సౌకర్యంలో పడి నిలిచిపోతారు, గొప్ప ఆలోచనలు, భావాలు కలిగే సామర్థ్యాన్ని కోల్పోతారు, వారు భయస్తులై ఆటవిక ప్రవృత్తిలోకి వెళ్ళిపోతారు.
    • ఫ్యొడొర్ దస్తోవిస్కీ (1821-1881).
  • ఎవరైతే యుద్ధవ్యూహాల్లో అత్యున్నత స్థాయిని అందుకుంటారో, వారు ఇతరులను తప్పనిసరి స్థితిలో పెడతారు తప్ప వారినెవరూ తప్పనిసరి స్థితిలోకి నెట్టలేరు.
  • మన సేనానుల్లో కొందరు విఫలం కావడానికి కారణం వారు నియమాలకు అనుగుణంగానే ప్రతీదీ చేయడం. ఫ్రెడ్రిక్ ఒకచోట ఏం చేశాడో, నెపోలియన్ మరోచోట ఏం చేశాడో వాళ్ళకి తెలుసు. వాళ్లు ఎప్పుడూ ‘‘ఇదే నెపోలియన్ అయితే ఏం చేసేవాడు...’’ అనే ఆలోచించేవారు. నేనేమీ సైనిక చరిత్ర విజ్ఞానాన్నేమీ తక్కువ చేయట్లేదు కానీ మనుషులు యుద్ధాన్ని బానిసల్లా నియమాలకు ఒడంబడి చేస్తే వాళ్ళు విఫలమవుతారు... యుద్ధం అనేది ప్రగతిశీలం.
    • యులిసిస్ ఎస్.గ్రాంట్(1822-85).
  • యుద్ధంలో మంది కాదు వ్యక్తి మాత్రమే లెక్కకువస్తాడు.
  • ఎప్పుడైతే ఆయుధాలు నిస్త్రాణమవుతుందో, స్ఫూర్తి అణగారిపోతుందో, ఎప్పుడైతే మన బలం లోతులు తాకి, వనరులు ఖాళీ అయిపోతాయో, అప్పుడు ఇతరులు మన నిస్సత్తువను అవకాశంగా తీసుకుంటారు. అప్పుడు ఒకవేళ నీ దగ్గర వివేకవంతులైన సైన్యాధ్యక్షులు ఉన్నా చివరికి పరిస్థితిని నీకు అనుకూలంగా తిప్పలేవు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  • యుద్ధం అన్నింటికీ తండ్రి, అన్నింటికీ రాజు.
    • హెరాక్లిటస్
  • పోరు మంచిది కాదు భూమి నెక్కడను/పాడౌను దేశంబు పగమించె నేని---శ్రీనాథుడు [1]
  • యుద్ధం అన్నింటికి తండ్రి. అన్నింటిని రాజు. . హెరాక్లిటస్

మూలాలు

[మార్చు]
  1. ఆత్మార్పణం, 10 వ తరగతి - తెలుగు వాచకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు,హైదరాబాద్,1984,పుట-24
"https://te.wikiquote.org/w/index.php?title=యుద్ధం&oldid=17150" నుండి వెలికితీశారు