Jump to content

వేమన

వికీవ్యాఖ్య నుండి

వేమన 1650-1750 మధ్య కాలములో జీవించి తెలుగు కవి. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పాడు.

వేమన పద్యాలలో అంతర్లీనంగా ఉన్న వ్యాఖ్యలు

[మార్చు]
 • అనఁగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
 • అనువుగానిచోట అధికులమనరాదు.
 • అన్ని దానములను నన్నదానమె గొప్ప; కన్నవారికంటె ఘనులు లేరు
 • అప్పులేనివాడె యధిక సంపన్నుడు.
 • అల్పబుద్ధివాని కధికార మిచ్చిన; దొడ్డవారినెల్లఁ దొలఁగఁ గొట్టు
 • అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గాను; సజ్జనుండు బలుకుఁ జల్లగాను.
 • ఆఁడుదాని బొంకు గోడపెట్టినయట్టు; పురుషవరుని బొంకు పూలతడిక.
 • ఆత్మశుద్ధి లేని యాచారమది యేల.
 • ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరె పోవువాడు వెర్రివాడు
 • ఆలివంకవార లాత్మబంధువు లైరి; తల్లివంకవారు తగినపాటి; తండ్రివంకవారు దాయాది తగవులౌ.
 • ఆశ కన్న దుఃఖ మతిశయంబుగ లేదు; చూపు నిలుపకున్న సుఖము లేదు; మనసు నిల్పకున్న మఱి ముక్తి లేదయా.
 • ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు; కాచియతుక నేర్చు కమ్మరీడు; మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా?
 • ఇంటియాలు విడిచి యిల జారకాంతల వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాఁడు.
 • ఇంటిలోని పోరు నింతింత గాదయా.
 • ఎలుకతోలు తెచ్చి ఏడాది ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు.
 • కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
 • కోపమున ఘనత కొంచెమైపోవును.
 • గంగి గోవుపాలు గరిటడైనను చాలు, కడవెడైనను నేమి ఖరము పాలు.
 • చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా.
 • చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా.
 • తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు.
 • తల్లితండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి?
 • తినగ తినగ వేము తియ్యనుండు
 • నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల
 • పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు.
 • పురుషులందు పుణ్య పురుషులు వేరయ.
 • భాండశుద్ధి లేని పాకమది యేల.
 • సాధనమున పనులు సమకూరు ధరలోన


w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=వేమన&oldid=13172" నుండి వెలికితీశారు