Jump to content

దలైలామా

వికీవ్యాఖ్య నుండి
దలైలామా

దలైలామా, టిబెట్ ‌లోని గెలుగ్ శాఖకు చెందిన బౌద్ధుల ఆచార్య పదవి పేరు. టిబెట్ లోని సాంప్రదాయిక బౌద్ధ శాఖల్లో ఇది అత్యంత నవీనమైనది. ప్రస్తుత దలైలామా, దలైలామాల పరంపరలో 14 వ వారు, భారతదేశంలో శరణార్థిగా నివసిస్తున్నాడు. అతడి పేరు టెన్జిన్ గయాట్సో . దలైలామాను తుల్కస్ శ్రేణిలో ఒకడిగా పరిగణిస్తారు. తుల్కస్ అంటే కారుణ్య బోధిసత్వుడైన అవలోకితేశ్వరుడి అవతారమని భావిస్తారు [1]


వ్యాఖ్యలు

[మార్చు]
  • నా మతం చాలా సింపుల్. నా మతం దయ.[2]
  • సంతోషం అనేది రెడీ మేడ్ కాదు. ఇది మీ స్వంత చర్యల నుండి వస్తుంది.
  • ఇతరులకు సహాయం చేయడమే ఈ జీవితంలో మన ప్రధాన లక్ష్యం. మీరు వారికి సహాయం చేయలేకపోతే, కనీసం వారిని బాధపెట్టవద్దు.
  • వీలైనప్పుడల్లా దయతో ఉండండి. ఇది ఎల్లప్పుడూ సాధ్యమే.
  • అసమ్మతి అనేది సాధారణ విషయం.
  • అటువంటి ప్రతికూల భావోద్వేగాలను అధిగమించడానికి, నా సమతుల్యతను కనుగొనడానికి నా విశ్వాసం నాకు సహాయపడుతుంది.
  • నన్ను నేను సాధారణ బౌద్ధ సన్యాసిగా అభివర్ణించుకుంటాను. ఎక్కువ కాదు, తక్కువ కాదు.
  • తార్కికంగా, సామరస్యం హృదయం నుండి రావాలి... సామరస్యం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. బలప్రయోగం చేసిన వెంటనే భయాన్ని సృష్టిస్తుంది. భయం, నమ్మకం కలిసి వెళ్లలేవు.
  • సాంకేతికత నిజంగా మానవ సామర్థ్యాన్ని పెంచిందని నేను భావిస్తున్నాను. కానీ సాంకేతికత కరుణను ఉత్పత్తి చేయదు.
  • మానవ ప్రపంచంలో ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ఉత్తమ మార్గం అన్ని వైపులా కూర్చుని మాట్లాడుకోవడం.


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=దలైలామా&oldid=21732" నుండి వెలికితీశారు