Jump to content

దేవరకొండ బాలగంగాధర తిలక్

వికీవ్యాఖ్య నుండి

దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-1966) ఒక ఆధునిక తెలుగు కవి. భావుకత, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు. భావ కవులలొ అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు.తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో , సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం వుంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడాని వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.

వచన కవితా పాదాలు

[మార్చు]
  • నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
  • నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
  • నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు[1]
  • చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..
  • దేవుడా! రక్షించు నాదేశాన్ని పవిత్రులనుండి, పతివ్రతలనుండి, పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి

తిలక్‌పై ఇతరుల వ్యాఖ్యలు

[మార్చు]

యువ కవి లోక ప్రతి నిధి
నవభావామృత రసధుని
కవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్చ స్పాటికా ఫలకం

గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
నభీస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి

--శ్రీశ్రీ[2]



మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. దేవరకొండ బాలగంగాధర తిలక్:అమృతం కురిసిన రాత్రి,నా కవిత్వం;విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్,1999,పుట-1
  2. శ్రీశ్రీ:అమృతం కురిసిన రాత్రి కి ముందుమాటగా రాసిన కవితా కదన క్షాత్రుడు లో...,విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్,1999,పుట-iv