నారా చంద్రబాబు నాయుడు

వికీవ్యాఖ్య నుండి

నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

చంద్రబాబునాయుడు యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • రావణాసురుడు, నరకాసురుడు, బకాసురుడు, మారీచుడు పురాణాల్లో ఉండేవారు. ఇప్పుడు వారంతా రాష్ట్రంలో పుట్టారు.[1]
  • ప్రజలకు పప్పుబెల్లాలు పంచి కొడుకుకి కోట్ల రూపాయలు దోచిపెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.[2]
  • కొండనైనా పిండి చేయగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది [3]
  • నేను నడిచేది పూలబాట కాదు, ముండ్లబాట (పాదయాత్రపై బాబు వ్యాఖ్య)[4]
  • తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు [5]
  • చెప్పులు కుట్టే చేతులు చరిత్ర సృష్టించాలి (మాదిగల అభివృద్ధి గురించి వ్యాఖ్య)[6]
  • గిరిజన కుటుంబాలకు పెద్ద కొడుకులా పనిచేసి చంద్రబాబు నాయక్ అనిపించుకుంటాను[7]
  • అవినీతిపరుల పట్ల నేను హిట్లర్ కంటే కఠినంగా ఉంటాను[8]
  • నిజాం హైదరాబాదు నిర్మిస్తే నేను సైబరాబాదు నిర్మించా[9]
  • దున్నపోతుకు గడ్డేశారు, పాలెలా ఇస్తుంది. [10]

చంద్రబాబునాయుడుపై ఉన్న ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది -- జి.కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)[11]
  • చంద్రబాబు ఓ చచ్చిన పాము, దాన్ని మళ్ళీ మళ్ళీ చంపలేము -- నారాయణ (సీపీఐ కార్యదర్శి)[12]
  • చంద్రబాబు నాయుడు బుర్ర ట్యూబ్ లైట్ వంటిది-- గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్
  • చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో స్టాండ్ ఉన్న సైకిల్‌ను తొక్కుతున్నారు-- హరీశ్ రావు (తెరాస నాయకుడు)[13]
  • 1999లో లాగులు కూడా వేసుకోని నేతలు ఇప్పుడు చంద్రబాబు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు-- కడియం శ్రీహరి[14]

ఇవి కూడా చూడండి[మార్చు]

గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్

గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ మంచి మాటలు

గొడ్డు వెలగల రామచంద్రారెడ్డి

పాల శ్రీరాములు

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 29-04-2012
  2. ఈనాడు దినపత్రిక, తేది 28-04-2012
  3. ఈనాడు దినపత్రిక, తేది 30-03-2012
  4. ఈనాడు దినపత్రిక, తేది 15-10-2012
  5. ఈనాడు దినపత్రిక తేది 03-10-2012
  6. ఈనాడు దినపత్రిక తేది 27-10-2012
  7. ఈనాడు దినపత్రిక తేది 01-12-2012
  8. ఈనాడు దినపత్రిక తేది 01-12-2012
  9. ఈనాడు దినపత్రిక తేది 13-11-2012
  10. (కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శ)ఈనాడు దినపత్రిక తేది 07-04-2013
  11. ఈనాడు దినపత్రిక, తేది 05-02-2012
  12. సాక్షి దినపత్రిక, తేది 21-02-2012
  13. ఆంధ్రజ్యోతి దినపత్రిక 11-07-2012
  14. ఈనాడు దినపత్రిక తేది 18-11-2012