ప్రేమ
స్వరూపం
ప్రేమకు సంబంధించిన వ్యాఖ్యలు
[మార్చు]- ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది. --రవీంద్రనాథ్ ఠాగూర్
- ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ, అవగాహన, తాదాత్మ్యత, స్పర్శ, కామం, ఓదార్పు. -- యండమూరి వీరేంద్రనాథ్[1]
- ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. --మహాత్మా గాంధీ
- ప్రేమ ఓర్పు కనబరుస్తు౦ది, దయ చూపిస్తు౦ది. ప్రేమ ఈర్ష్యపడదు, గొప్పలు చెప్పుకోదు, గర్వ౦తో ఉబ్బిపోదు, మర్యాద లేకు౦డా ప్రవర్తి౦చదు, స్వార్థ౦ చూసుకోదు, త్వరగా కోప౦ తెచ్చుకోదు. హానిని మనసులో పెట్టుకోదు. అది అవినీతి విషయ౦లో స౦తోషి౦చదు కానీ, సత్య౦ విషయ౦లో స౦తోషిస్తు౦ది. అది అన్నిటినీ భరిస్తు౦ది, అన్నిటినీ నమ్ముతు౦ది, అన్నిటినీ నిరీక్షిస్తు౦ది, అన్నిటినీ సహిస్తు౦ది. ప్రేమ శాశ్వత౦గా ఉ౦టు౦ది. -- సెయింట్ పాల్[2]
- ప్రేమే నా మతం దాని కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను -- జాన్ కీట్స్.
- జీవితం మనోహరమైన పుష్పం అయితే ప్రేమ అందులో నిరంతరం స్రవించే మధురమైన మకరందం వంటిది. -- విక్టర్ హ్యూగో.
- ప్రేమవల్ల, జ్ఞానం వల్ల జీవితం స్పూర్తి పొందుతుంది--బెర్ట్రాండ్ రస్సెల్స్.
- ప్రేమించడానికి హృదయం వుండాలి. ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం వుండాలి. -- యండమూరి వీరేంద్రనాథ్[3]
- ప్లేటో ప్రేమ పాత్రుడే; కాని సత్యం ఇంకా ప్రేమ పాత్రమైనది. .............. అరిస్టాటిల్.
- అందరూ ప్రేమిస్తారు కానీ ప్రేమని పొందేది కొందరే.
- తెలిసి తెలియని వయస్సు, ఎదిగి ఎదగని మనస్సు చేసే ఇంద్రజాలపు ఆకర్షణే ప్రేమ.
- ప్రేమలో ప్రే అంటే ప్రేమించటం, మ అంటే మరిచిపోవటం.
- దౌర్భాగ్య విఫణి వీధిలో నేడు ప్రేమ కూడా ఒక వర్తకపు వస్తువే.
- ఆత్మవంచనకు మనం అందంగా పెట్టుకున్న పేరే ప్రేమ.
ప్రేమకు సంబంధించిన పాటలు
[మార్చు]- ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం