ప్లేటో
ప్లేటో ప్రముఖ గ్రీకు తత్వవేత్త. ఇతడు క్రీ.పూ.427లో జన్మించి క్రీ.పూ.347లో మరణించాడు. పురాతన గ్రీకు రాజ్యమైన ఎథెన్స్‌లో అకాడమీ స్థాపించి పాశ్చాత్య ప్రపంచంలో ఉన్నత విద్యకై కృషిచేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు.
గ్రీకుకే చెందిన ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో రచించిన గ్రంథాలలో "ది రిపబ్లిక్" ప్రముఖమైనది. అరిస్టాటిల్ ఇతడి శిష్యుడు.
ప్లేటో యొక్క ముఖ్య ప్రవచనాలు
[మార్చు]- విద్య అనేది మనిషిలోని మంచిని వెలికితీయడానికి చేసే ప్రయత్నం.
- మనస్సు మెడడులోనూ, ఇచ్ఛ హృదయం లోనూ, వాంఛలు ఉదరంలోనూ ఉంటాయి.
- ఆశ్చర్యపడటం తత్వవేత్తల లక్షణం. తత్త్వశాస్త్రం ఆశ్చర్యంతోనే ప్రారంభమవుతుంది.
- తాత్త్విక యోచనను మించిన ఉన్నత సంగీతం మరొకటిలేదు.
- విమర్శతో కూడినదే జీవితం. ఆ విమర్శే జీవం.
- నిజం పలికే వాడికంటే ద్వేషింపబడే వాడెవ్వడు లేడు.