భగవంతుడు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

భగవంతుడు పైన వ్యాఖ్యలు[మార్చు]

  • భగవంతుడు ఈస్థూలశరీరమున ఎట్లువసించును? చిమ్మురు గొట్టములోని (Syringe) పుడకవలె అతడీ శరీరమున నుండును కాని అతడీశరీరమునకు అంటుకొనియుండడు.
  • చంద్రుడు ప్రతిబాలకునకును "మామ" అయినవిధమున, భగవంతుడు సర్వమానవకోటికిని "గురువు" అగుచున్నాడు. రామకృష్ణ పరమహంస.
  • భగవంతుడు నరులందఱియందున్నాడు. కాని నరులందఱును భగవంతునిలోలేరు. అందువలననే వారుదుఃఖముల పాలగుచున్నారు.
  • భగవంతుడు బాహ్యమున ఎక్కడనో దూరముగ కాన్పించునంతవరకును అజ్ఞానమున్నట్లే. ఆభగవంతుడు లోపల సాక్షాత్కరించినప్పుడు అది సత్యజ్ఞానమగును.... రామకృష్ణ పరమహంస


w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=భగవంతుడు&oldid=16931" నుండి వెలికితీశారు