ముత్యాలముగ్గు
స్వరూపం
ముత్యాలముగ్గు 1975 లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఒకటి కాదు. దాదాపు అన్నీను. వాటిని తూర్పు గోదావరి యాసలో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.
సంభాషణలు
[మార్చు]- సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
- అబ్బో ముసలాడు రసికుడేరా! సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
- ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా...ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త
- మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెషను ఉంటుందా? ఈ విసయంలో మీకు నాకు ఒక కాంప్రొమైజ్ కుదిరితే నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను.
పాటలు
[మార్చు]- ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ, మత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయ...ముళ్ళపూడి వెంకటరమణ