మూగ మనసులు
Jump to navigation
Jump to search
మూగ మనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో నిర్మించిన 1964 నాటి తెలుగు చిత్రం. అంతస్తుల కారణంగా విడిపోయిన జంట పునర్జన్మలో వివాహం చేసుకుని కలవడం కథాంశం. సినిమాని చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బాబూ మూవీస్ పతాకంపై నిర్మించారు. ఆదుర్తి తాను చదివిన చిన్న కథను అనుసరించి తయారుచేసిన లైన్ కి, ఆదుర్తి కోరికపై ముళ్ళపూడి వెంకటరమణ మూగమనసులు పేరిట ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు.
పాటలు[మార్చు]
- ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడు పెనవేసి ముడివేసెనో
- గోదారీ గట్టుంది, గట్టుమీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, ఆ పిట్ట మనసులో ఏముంది...ఆత్రేయ
- గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
- నా పాట నీ నోట పలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గు లోలకాల సిలకా
- పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా
- మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ మామూలు మడిసిని నేను
- ముక్కుమీద కోపం నీ ముఖానికీ అందం
- ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే