Jump to content

రాజా రాణి

వికీవ్యాఖ్య నుండి

రాజా రాణి తెలుగులో తమిళమాతృక నుంచి అనువాదమైన డబ్బింగ్ చిత్రం. రొమాంటిక్ కామెడీ జానర్ కి చెందిన ఈ చలన చిత్రానికి దర్శకత్వం అట్లీ వహించగా ప్రధాన పాత్రధారులుగా ఆర్య, నయనతార నటించారు.

సంభాషణలు

[మార్చు]
  • మనకి కావాల్సినవాళ్ళు వెళ్ళిపోతే మనమూ పోనక్కర్లా, ఏదో ఒకరోజు మన లైఫ్ మనకు నచ్చినట్టు మారుతుంది.
    • ఈ డైలాగ్ సినిమాలో హీరోతో సహా చాలామందే చెప్తారు. కీర్తన(నజ్రియా) ఈ డైలాగును ఇలా చెప్తారు: మన జీవితంలో మనకి అత్యంత ముఖ్యమైనవాళ్ళు చనిపోతే మనమూ వాళ్ళతోపాటు పోనక్కర్లేదు జాన్, ఏదో ఒకరోజు మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది.
  • హెన్రీ(హీరో బాస్ పాత్ర): జాన్ నా వృత్తి చెయిన్లు తెంపడం.
జాన్(ఆర్య): (ఆశ్చర్యపోతూ) సార్
హెన్రీ: గోల్డ్ చెయిన్లు. టెన్త్ రెండుసార్లు ఫెయిల్డ్. ఎందుకంటే నా బుర్రకసలు చదువే ఎక్కేది కాదమ్మా.
సారధి(సంతానం): ఆ బుర్ర మీదకి పేనే ఎక్కదు. ఇంక చదువేం ఎక్కుతుంది.
హెన్రీ: నువ్వూరుకోవోయ్. ఓ అమ్మాయి మెళ్ళో చైన్ లాగేప్పుడు మొహం చూశాను. చూడగానే పట్టేసింది.
సారధి: లేడీ పోలీసా?
హెన్రీ: నువ్ ఆగవోయ్. నా మనసుకి పట్టేసింది. అప్పట్లో నాకు ఐ లవ్యూ అనడం తెలీదు. ఏయ్ అమ్మాయ్ నువ్వునాకు నచ్చావమ్మాయ్ అన్నాను. తను ఏం అందంటే ముందు చెయిన్ మీద చెయ్ తియ్, టెన్త్ పాసై రా అప్పుడు మాట్లాడతానంది. నేను కష్టపడి టెన్త్ పాసై, తన దగ్గరకెళ్ళాను. ఎంబీయే పూర్తిచేసుకుని రా అప్పుడు నిన్ను పెళ్ళిచేసుకుంటానంది. నానా తంటాలు పడి ఎంబీయే పూర్తిచేసేకా తన దగ్గరకెళ్ళాను. పెళ్ళిచేసేశారు. అప్పుడే తెలిసింది, తన నాన్న ఎవరంటే మన షోరూం ఓనరని. బందరు లడ్డూలాంటి అమ్మాయినీ ఇచ్చారు. ఆఫీస్ తాళాల గుత్తీ ఇచ్చారు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే ఏ రోజైతే నా లవ్ గురించి చెప్పానో అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటకి చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవ్వుద్ది. మనసులో వుంచుకుని చెప్పలేదనుకో ఏ ప్రయోజనం లేదు.

వ్యాఖ్య

[మార్చు]
  • There is life after love failure. There is love after love failure.
    • ప్రేమ విఫలమయ్యాకా జీవితం వుంటుంది. ప్రేమ విఫలమయ్యాకా మరో ప్రేమా వుంటుంది.
"https://te.wikiquote.org/w/index.php?title=రాజా_రాణి&oldid=12976" నుండి వెలికితీశారు