విద్య
స్వరూపం
విద్య అనగా జ్ఞానం సముపార్జించడం. పూర్వకాలంలో విద్యార్థులు గురువుల వద్ద ఉండి వారికి సేవ చేస్తూ విద్యను పొందేవారు. కాలక్రమేణా విద్య యొక్క స్వరూపం మరియు అర్థం మారిపోయింది. ఇది చదువుకు పర్యాయపదంగా మారింది.
విద్యపై ఉన్న కొటేషన్లు
[మార్చు]- వ్యక్తికి స్వావలంబన చేకూర్చేదే నిజమైన విద్య. --స్వామి వివేకానంద
- విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. మనిషి వికాసానికి, నడవడికి తోడ్పడుతుంది.---స్వామి వివేకానంద
- ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది. --స్వామి వివేకానంద
- విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకపోతే వారి చదువంతా వృథా. --మహాత్మా గాంధీ
- మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది. --మహాత్మా గాంధీ
- విద్య అనేది మనిషిలోని మంచిని వెలికితీయడానికి చేసే ప్రయత్నం. --ప్లేటో
- హింసకు విరుగుడు విద్యే -- ప్రణబ్ ముఖర్జీ (రాష్ట్రపతి)[1]
- జివితంలో ఒంటరిగా నడవడం నేర్పేదే విద్య .....హార్న్
- విద్యలేని వాడు వింతపశువు. ........సుమతీ శతకము
- విద్య నిఘూడమగు విత్తము. ,,,,,,,,,బర్తృహరి
- విద్య ద్వారానే మానసిక వికాసం-సామాజిక ప్రకాశం. --పొట్లూరి హరికృష్ణ
- చదువది ఎంత గల్గిన రసయిజ్ఞత ఇంచుక చాలకున్న ఆచదువది నిరర్థకమ్ము గుణ సంహితులెవ్వరు మెచ్చరెచ్చటన్... భాస్కర శతకము
- చదువు లేని వాడినని దిగులు చెందకు.... ఏ చదువు చదివి పక్షులు పైకెగర గల్గెను.......ఖైది కన్నయ్య సినిమాలో ఒక పాట
విద్యపై ఉన్న సామెతలు
[మార్చు]- అభ్యాసము కూసు విద్య
- చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
- చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
- చదవేస్తే ఉన్నమతి పోయిందట ఒక సామెత
- చదువు రాకముందు కాకరకాయ అనేవాడు చదివిన తరవాత కరకరకాయ అన్నాడట ఒక నానుడి
- విద్య లేనివాడు వింత పశువు
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక తేది 08-11-2012