విరాట్ కోహ్లి

వికీవ్యాఖ్య నుండి
విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లి ( జననం: 1988 నవంబరు 5[3]) ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. [1]


వ్యాఖ్యలు[మార్చు]

  • ఆత్మవిశ్వాసం, కృషి ఎల్లప్పుడూ మీకు విజయాన్ని అందిస్తాయి.[2]
  • ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టు కూడా ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడదు. జట్టు ఎప్పుడూ గెలుపే లక్ష్యంగా ఆడుతుంది.
  • నేను నేనుగా ఉండటానికి ఇష్టపడతాను, నేను నటించను. ఉదాహరణకు, నేను సందర్భాలకు దుస్తులు ధరించను; నేను ఎలా ఉన్నానో అదే.
  • ఒత్తిడిలో ఆడటాన్ని ఇష్టపడతాను. నిజానికి ఒత్తిడి లేకపోతే నేను పర్ఫెక్ట్ జోన్ లో లేను.
  • మ్యాచ్ కు ముందు మంచి పంజాబీ సంగీతం నన్ను ఉత్సాహపరుస్తుంది. అది నాకు కిక్ ఇస్తుంది.
  • భారత క్రికెట్ జట్టు తరఫున మైదానంలో రాణించడమే నా ప్రధాన లక్ష్యం. మైదానం వెలుపల ప్రజలు నా గురించి మంచి విషయాలు చెప్పినప్పుడు, నేను వాటిని అంగీకరించడానికి ఎక్కువ సంతోషిస్తాను.
  • సచిన్ టెండూల్కర్ జీవితంపై సినిమా తీయాలని కోరుకుంటున్నా. దాని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ సినిమాలో చాలా ఎమోషన్ ఉంటుంది.


మూలాలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.