వీటూరి

వికీవ్యాఖ్య నుండి

వీటూరి నాటకాల రచయిత. ఇతని పూర్తిపేరు వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి (1934 - 1985). "కల్పన" అనే నాటకము ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యాడు.ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధుడు. తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ఛందస్సు, వ్యాకరణాన్ని అభ్యసించి, గ్రంథాలు చదివి, తానుగా పద్యాలు రాయడం ఆరంభించారు. తన పద్యాల్ని పత్రికలకు పంపడం, కవి సమ్మేళనాల్లో వినిపించడం చేసేవారు. పౌరాణికాలతో ఆగకుండా, సాంఘిక నాటకాలు కూడా రాశారు. తను రాసిన పురాణ నాటకాలకు తనే, హార్మోనీ వాయించేవారని అనేవారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాలల్లో తెలుగు బోధించేవారు.

తెలుగు సినిమా పాటలు[మార్చు]

  • ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. - దేవత
  • ఎదలో తొలి వలపే విరహం జత కలిసే, మధురం ఆ తలుపే నీ పిలుపే - ఎర్ర గులాబీలు
  • గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు. - ఇదాలోకం
  • రావేల కరుణాలవాల దరిశనమీయగ రావేల నతజనపాల...శ్రీరామకథ
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=వీటూరి&oldid=16915" నుండి వెలికితీశారు