భార్య
స్వరూపం
(ఇల్లాలు నుండి మళ్ళించబడింది)
పురుషుడిని వివాహం చేసుకున్న స్త్రీని భార్య అందురు. సతి, పత్ని, ఇల్లాలు అనే పదాలు దీనికి ప్రత్యమ్నాయాలు.
భార్యపై వ్యాఖ్యలు
[మార్చు]- మీ భార్య పుట్టిన రోజును జీవితాంతం గుర్తించుకోవాలంటే ఒక్కసారి మర్చిపోయి చూడండి చాలు. --జో బ్రాండ్
- నా ఇద్దరు భార్యల వల్లా నాకు దురదృష్టమే ఎదురైంది. మొదటి భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, రెండో భార్య వదిలిపెట్టలేదు. --ప్యాట్రిక్ ముర్రే
- నా భార్యతో మాట్లాడటానికి నావద్ద కొద్ది పదాలే ఉంటాయి కాని ఆమె వద్ద పేరాలకు పేరాలు ఉంటాయి. -- సిగ్మండ్ ఫ్రాయిడ్
- ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరె పోవువాడు వెర్రివాడు -- వేమన
- కాలం గడుస్తున్న కొద్దీ భార్యలు ఆకర్షణ కోల్పోతారు-- ప్రకాష్ జైస్వాల్ (కేంద్ర మంత్రి)[1]
భార్యపై సామెతలు
[మార్చు]- అంగటి వీధిలో ఆలిని పడుకోబెట్టి వచ్చేవారు పొయ్యేవారు దాటిపోయినారు అన్నట్టు.
- ఆలి చచ్చినవాడికి ఆడదే బంగారం
- ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
- ఆలి బెల్లమాయె, తల్లి అల్లమాయె.
- ఆలి మాటవిన్నవాడు అడివిలో పడ్డవాడు ఒకటే.
- ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట.
- ఆలికి గంజిపోయనివాడు ఆచారం చెప్పినట్లు.
- ఆలిని అదుపులో పెట్టలేనివాడు అందరినీ అదుపులో పెట్టగలడా?
- ఆలిని ఒల్లని వాడు ఈలకూరలో ఉప్పులేదన్నాడట.
- ఆలుమగల కలహం అన్నం తినేదాకనే.
- ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం.
- ఇంటికి దీపం ఇల్లాలు.
- ఇంటిని చూసి ఇల్లాలిని అంచనావేయవచ్చు
- ఇల్లాలులేని ఇల్లు దయ్యాలకొంప.
- భార్య అనుకూలవతి ఐతే సుఖి లేకుంటే వేదాంతి ఔతారు.
- భార్యమాట బ్రతుకుబాట.
భార్యపై సినిమా పాటలు
[మార్చు]- ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. (దేవత) - వీటూరి
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక తేది 03-10-2012