సర్వేపల్లి రాధాకృష్ణన్
స్వరూపం


సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) సెప్టెంబర్ 5, 1888న జన్మించాడు. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణన్ ఏప్రిల్ 17, 1975న మరణించాడు.
సర్వేపల్లి వ్యాఖ్యలు
[మార్చు]- మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
- ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది.
- ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము. ప్రేమాభిమానాలతోనే చల్లబర్చగలము.
- శాంతిరాయభారం బలహీనత కాదు-మారణ హోమం రాజనీతి కాదు.
- చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో
- ప్రపంచ చరిత్రలో హిందూ ధర్మం మాత్రమే మానవ మనస్సుకి సంపూర్ణ స్వేఛ్ఛను, స్వాతంత్య్రాన్ని ఇచ్చింది. దానికి తన శక్తుల మీద పూర్తి ఆత్మ విశ్వాసం ఉంది. హిందూ ధర్మం అంటే స్వేచ్ఛ. ముఖ్యంగా భగవంతుని గురించి ఆలోచించడంలో పూర్తి స్వేచ్ఛ.
- మంచి పనులకు పునాది క్రమశిక్షణే. అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది.
- శ్రద్ధగలవాడు మాత్రమే ఏ విద్యలోనైనా నేర్పు పొందగలడు.
- విద్య అనేది వ్యక్తికి మాత్రమే కాదు, సమాజానికి కూడా వెలుగులు ప్రసాదించే శక్తివంతమైన ఆయుధం[1]
- విద్య అనేది మనిషిని మెరుగైనవాడిగా మార్చే సాధనం — కేవలం ఉద్యోగం కోసం కాదు[2]
- చదువు మనిషిని సృజనశీలిగా మలచాలి. చారిత్రక ప్రకృతిక ప్రతికూలతలకు వ్యతిరేకంగా పోరాడగల స్వేచ్ఛనివ్వాలి.పుస్తకాల ద్వారా వివిధ సంస్కృతుల మధ్య వారధిని నిర్మించుకోవచ్చు. అయితే మన గురించి మనం ఆలోచించుకోగలేందుకు సాయపడే వాళ్లే నిజమైన గురువులు.[3]
