జీవితం
Appearance
మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే.
వ్యాఖ్యలు
[మార్చు]- తోటి సోదరుల మంచి కోసం కష్టించని జీవితం మానవుడికి జీవితమే కాదు. - ఆయన్ రాండ్
- జివితంలో ఒంటరిగా నడవడం నేర్పేదే విద్య .....హార్న్
- లాంగ్ షాట్ లో ఆనందంగానూ, క్లోజప్ లో విషాదంగానూ కన్పించేదే జివితం..... చార్లి చాంప్లిన్
- జీవితం రేడియో సెట్టుకు భర్త ఏరియల్,భార్య ఎర్త్.--ఆరుద్ర[1].
- జీవితం చివర తెలియని చీకటి వంతెన--మాదిరాజు రంగారావు[2].
- జీవితం కరిగిపోయే మంచు-ఉన్నదానిని నలుగురికి పంచు--గోపాల చక్రవర్తి[3].
- జీవితంలో అందరి ప్రయత్నమూ గెలవడానికే, ఎవడూ ఓడదలచడు--దాశరథి రంగాచార్య్
- కొద్దిగా లోకజ్ఞానం, సహనం, హస్యరసజ్ఞత ఉంటే మనిషి హాయిగా జీవించవచ్చు---సోమర్‌సెట్ మామ్
- జీవితమంటే రెండు సుదీర్ఘ అంధకారాల మధ్యనుండే వెలుతురు రేఖ --?
- తథ్యమైన మరణం కంటే తాత్కాలికమైన జీవితమే ప్రాణుల్ని అధికంగా ప్రలోభపెడుతుంది...--?
- జీవితం సహారా ఎడారి కాదు- చిగురించే స్వభావం కలది.----బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త[4]
- తథ్యమైన మరణం కంటే తాత్కాలికమైన జీవితమే ప్రాణులని అధికంగా ప్రలోభపెడుతుంది.
- మనిషి బతకటం గొప్ప కాదు, సాటి మనిషిని బతికించటం గొప్ప.
- తాను బతకటం కోసం ఇంకో మనిషిని చంపటం కాదు, ఇంకో మనిషి బతకటం కోసం అవసరమైతే తాను చావాలి.
- అవినీతి పద్ధతులలో ధనవంతులైపోవడం కన్నా, నీతిగా బతుకుతూ దరిద్రులుగా మిగిలిపోవడమే ఉత్తమం---అజ్ఞాత రచయిత
- ప్రతి జీవిమీద జాలి వున్నావాడే గొప్ప వ్యక్తి. బుద్ధుడు........ సూక్తి సింధు గ్రంథం.
- జీవితము పేకాట ఏ పని చేసినా పట్టుదల కావాలి. ఎలా ఆడతావనేది స్వంత కోరిక జవహర్ లాల్ నెహ్రూ........ సూక్తి సింధు గ్రంథం.
- జీవితము విలువ అది చేసే పనుల మీద సాంద్రత మీద ఆధారపడుతుంది. ఆస్కార్ వైల్డ్........ సూక్తి సింధు గ్రంథం.
- జీవితమంటే చావుకు ముందు పడే అవస్థ హెన్రీ జేమ్స్........ సూక్తి సింధు గ్రంథం.
- జీవితాన్నుండి ఎవరు పారిపోలేరు .........స్వామి చిన్మయానంద
- జీవితం ఓ కదలిక ...................స్వామి వివేకానంద ........ సూక్తి సింధు గ్రంథం.
- జీవితకాలం మనమీద నృత్యం చేస్తుంది. మంచు ఆకు మొనలమీద నిలబడినట్లు. ....రవీధ్రనాథ్ టాగూర్.....సూక్తి సింధు గ్రంథం
- జీవితం లేని మతం నిరుపయోగం. ............. హేగ్స్సూక్తి సింధు గ్రంథం
- ప్రజానీకంలో ఎక్కువమంది జనాలు నిరాశతో జీవితం కొనసాగిస్తారు. .... హెన్రి ధోరో.....సూక్తి సింధు గ్రంథం నుండి
- ఎంతకాలం బ్రతికామన్నది కాదు...... ఎలా జీవించామన్నదే.......... జేమ్స్ బైలీ ....సూక్తి సింధు గ్రంథం నుండి
- ఈరోజుల్లో మనిషి జీవితం ఆహారం మీద కేంద్రీకరించ బడినది. రామకృష్ణ...సూక్తి సింధు గ్రంథం నుండి
- కష్టసుఖాల కలగలుపే జీవితం ఇందిరాగాంధీ ..సూక్తి సింధు గ్రంథం నుండి
- బతుకు ఒక పోరాటం. దానికోసం ఆరాటం పనికి రాదు. కాళోజి ..సూక్తి సింధు గ్రంథం నుండి
- అతి దగ్గరగా వున్నప్పుడు జీవితం విషాదంగా ..... దూరంగా వున్నప్పుడు సుఖంగా కనుపిస్తుంది. చార్లీ చాప్లిన్ ..సూక్తి సింధు గ్రంథం నుండి
సినిమా పాటల్లో జీవితం
[మార్చు]- ఒక్కడైనా కానరాడే, జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు[5].
- జీవితమే సఫలమూ ..... రాగ సుధా భరితమూ ప్రేమ కథా మధురము........
మరో ప్రవాహం(నవల)లో జీవితం
[మార్చు]తెలుగు నవలా రచయిత వి.రాజా రామ్మోహనరావు రచించిన ప్రముఖ నవల ఇది. ఇందులో జీవితానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు...
- బతుకులో ఉన్నది పొగొట్టుకోవడం ఓ బాధ-పొగొట్టుకున్నది గుర్తు రావడం మరో బాధ.
- ఎంత నికృష్టపు బతుక్కైనా ప్రతి బతుక్కూ అపురూపమైనవై కొన్ని ఉంటాయి.
- ప్రతి మనిషి జీవితంలో నిలబడటానికి ఆలోచన, శ్రమ అవసరం.
- ఇతరుల మీద ఆధారపడి జీవించడం పెద్ద దరిద్రం.
- ఎంతటి పనికిరాని బతుక్కేనా ఎగసిపడే గుండె ఉంటుంది. అన్యాయానికి ఆవేశపడే మనసు ఉంటుందని చాలా మందికి తెలియదు.
- ఎవరి బతుక్కైనా సలహా ఇవ్వటానికి గొప్ప విజ్ఞానం కన్నా అనుభవం, సరైన దృష్టి ముఖ్యం.
- ఎంతగానో దిగజారిన బతుకు భయంకరమైన మొండితనాన్నే కాదు, దానికన్న అసహ్యకరమైన మొరటుతనాన్ని ఇస్తుంది.
- తమ బతుకుల బాధల వెనుకాల ఉన్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక వలయాల శక్తి చాలా మందికి తెలియకపోయినా, ఏదో శక్తి తాలూకు ఒత్తిడి తమ బతుకుల మీద ఉందని ఇంచుమించు ప్రతి బడుగు బతుక్కూ తెలుసు.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-11
- ↑ తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-10
- ↑ తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994,పుట-11
- ↑ నవ్య జగత్తు,(ఆశాలత కవిత), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్. పుట-103
- ↑ w:s/o సత్యమూర్తి చిత్రంలోని చల్..చలో..పాటలో