పెళ్ళి
స్వరూపం
మానవ జీవితంలో అతి ముఖ్యఘట్టాల్లో పెళ్ళి ఒకటి.
పెళ్ళికి సంబంధించిన వ్యాఖ్యలు
[మార్చు]- పెళ్ళికి ముహుర్తమా !!! ముహుర్తము లేని పెళ్ళి ఇందూ సాంప్రదాయమగును :- శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
- మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు: - ఆచార్య ఆత్రేయ
- మగవాడు పెళ్ళి చేసుకుంటే మనం ఓ స్నేహితుడిని కోల్పోయినట్లే -- హ్యూరిక్ ఇచ్సెన్
- పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు -- గురజాడ అప్పారావు
- పెళ్ళంటే... చేపను పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చేయి పెట్టడం లాంటిది -- లియోనార్డో డావిన్సీ
- పెళ్ళి చేసుకోవడం సులభం, కాపురం చేయడమే కష్టం-- రాబర్ట్ ఫ్లాక్.
పెళ్ళికి సంబంధించిన సామెతలు
[మార్చు]- అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
- ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి
- ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు.
- గుండ్రాయి దాచేస్తే పెళ్లాగిపోతుందా?
- పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
- పూరణం లేని బూరె, వీరణం లేని పెళ్ళి.
- పెళ్ళంటే నూరేళ్ళ పంట
- పెళ్ళకొ తంటా, భుజాల మంట.
- పెళ్ళికి రావయ్యా అంటే, విందుకు వీలు చేసుకుంటానన్నాడట
- పెళ్ళికి వెళ్తుంటే పిల్లి అడ్డమొచ్చినట్లు.
- పెళ్ళినాటి విందు ప్రతిరోజు పసందుగా ఉండదు.
- చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నం.
- కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
- దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే.
- దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
- పెళ్ళికి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు
- ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
- వెయ్యి అబద్దాలాడి అయినా ఒక పెళ్ళి చెయ్యమన్నారు.
- దేవుడి పెళ్ళికి అందరూపెద్దలే.