గురజాడ అప్పారావు
స్వరూపం
గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 అప్పారావు జన్మించాడు. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు . 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించాడు.
గురజాడ అప్పారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నియు మెలగవలెనోయ్
- ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది.
- ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.
- ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్.
- చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయి
- తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
- దేశమనియెడి దొడ్డ వృక్షం, ప్రేమలను పూలెత్తవలెనోయ్.
- పెళ్ళిళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు
- మందగించక ముందు అడుగేయి, వెనుకపడితే వెనెకోనోయ్
- మతం వేరైతేను యేమోయ్, మనసు వొకటై మనుషులుంటే
- మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.
- వట్టిమాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్
- వ్యర్థ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్
- సొంత లాభము కొంత మానుకు, పొరుగువాడికి సాయపడవోయి
- అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ వుంటుంది.
- తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
- ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.
గురజాడ అప్పారావుపై చేసిన వ్యాఖ్యలు
[మార్చు]- గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు-- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ -- శ్రీశ్రీ