Jump to content

పిల్లి

వికీవ్యాఖ్య నుండి

పిల్లి ఒక పెంపుడు జంతువు. ఇది పాలు, మాంసం ముఖ్యంగా ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది.

పిల్లిపై ఉన్న వ్యాఖ్యలు:

[మార్చు]

పిల్లిపై ఉన్న సామెతలు

[మార్చు]
  • అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
  • ఇంట్లో పిల్లి, వీధిలో పులి.
  • గోడ మీది పిల్లి.
  • పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు.
  • పిల్లి గుడ్డిదైతే ఎలుక గడ్డి పెట్టిందట.
  • పిల్లి నెత్తిన వెన్నబెట్టినట్లు.
  • పిల్లి పిల్లలను త్రిప్పినట్లు.
  • పిల్లికి ఎలుక సాక్ష్యం.
  • పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం.
  • పిల్లికి బిచ్చం పెట్టనివాడు.
  • పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్లు.
  • పెళ్లికి వెళుతూ పిల్లిని చంకనపెట్టుకున్నట్లు.
  • కాలు కాలిన పిల్లిలా
  • మల్లిని చేయబోతే పిల్లి అయినట్లు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

"https://te.wikiquote.org/w/index.php?title=పిల్లి&oldid=12530" నుండి వెలికితీశారు