మోసం
స్వరూపం
మోసం అంటే ఉన్నదాన్ని లేదనో, లేనిదాన్ని ఉందనో తెలివిని వినియోగించి చూపి, చెప్పి ఒప్పించడం. దీన్నే వంచన అని కూడా అంటారు.
వ్యాఖ్యలు
[మార్చు]- నువ్వు అందరినీ కొంతకాలం, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని అందరినీ ఎల్లకాలం మోసం చేయజాలవు.
- అబ్రహాం లింకన్, (12 ఫిబ్రవరి 1809 - 15 ఏప్రిల్ 1865).
- మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.
- గురజాడ అప్పారావు, కన్యాశుల్కం నాటకంలో రామప్పంతులు పాత్రనుద్దేశించి.
- నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.
- త్రివిక్రమ్ శ్రీనివాస్, అతడు చలనచిత్రంలో నందు(మహేష్ బాబు) పాత్ర.