సోక్రటీస్
Wikiquote నుండి
సోక్రటీస్ (ఆంగ్లం: Socrates; గ్రీకు: Σωκράτης, Sōkrátēs; c. 469 BC) ( క్రీ.పూ 470 - క్రీ.పూ 399) గ్రీకు దేశంలోని ఏథెన్సుకు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఈయన సృష్టించిన సోక్రటీసు విధి/పద్దతి చాలా ప్రాచుర్యం చెందినది. ఈయన సృష్టించిన తత్వశాస్త్ర విధానంలో సాగే భోదనా విధానంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్న విద్యార్థి మనసులోని మంచి సమాధానాన్ని, ప్రాథమిక భావనల్ని బయల్పరిచేదిగా ఉండాలి.
సోక్రటీసు పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ప్లేటో, మరియు అరిస్టాటిల్ పై ఈయన ప్రభావం ఎంతో ఉంది. నీతి నియమాలు, తర్క శాస్త్రం లో ఈయన ఎనలేని కృషి చేశాడు.
సోక్రటీస్ ప్రముఖ ప్రవచనాలు[మార్చు]
- తినడం కోసం జీవించడం కాకుండా జీవించడం కోసం తినాలి.
- తనను గూర్చి తనకే తెలియనివాడే నిజమైన అజ్ఞాని.
- సంతృప్తి సహజ సంపద. ఆడంబరం కృత్రిమ దారిద్ర్యం.
- భోగభాగ్యాలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మటుకు అభిమానాన్ని, ఆశీర్వచనాలను తీసుకువస్తుంది.
- మృత్యువును తప్పించుకోవడం పెద్ద విషయం గాదు. తప్పుచేయకుండా తప్పించుకోవడం గొప్ప విషయం.
- ఇతరులు నోళ్లు మూయించడానికి ప్రయత్నించేకన్నా నీ మంచితనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం మేలు.
- ఎలాగో ఒకలా బ్రతకడం కాదు కావలసింది - ఎలా బ్రతుకుతున్నాం అన్నది కూడా ముఖ్యం.
- తార్కికంగా యోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయాన్ని తీసుకుని దానికి అనుగుణంగా మన ఆలోచన నిర్ణయించుకుంటూ పోకూడదు.
- మనుషులను గాయపరచడం ఎంత తప్పో, మనసులను గాయపరచడం కూడా అలాంటి తప్పే.
- ఒక తప్పు మరొక తప్పువల్ల సరిచేయబడదు.