అనుభవము

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

అనుభవము వ్యాఖ్యలు[మార్చు]

 • మృత్యువే చివరిది కాదు. ఈ జీవితము అనుభములో ఒక భాగము. ........ స్టక్ వుడ్
 • భావాలు మనిషిని కదిలిస్తాయి. అనుభవము మాత్రమే కోరికకు రూపము ఇస్తుంది. ....... శామ్యూల్స్మైఒల్స్
 • పెరిగిన కొద్ది అనుభవము, తెలివి పెరుగుగాయి. ............. కాంప్ బెల్
 • అనుభవము నేర్పినట్లు మరేది నేర్పదు ........... జాన్ ఐన్సన్
 • మానవుని పనితనము అతని అనుభవము మీద ఆధారపడుతుంది. ........... వీనర్
 • అనుభవము ఓ ఉపాధ్యాయుడు. ఆనికి కొన్ని పరిమితులున్నాయి. ....... ఎ.కె.నరసింహన్
 • ప్రతి వాడిలోను అనుభవము దాగి వుంటుంది. కాకుంటే అతుకులుగా అర్థరహితముగా మేధావులకు అర్థము కానిదిగా ................మాంటేగ్
 • మృత్యువు జీవితానికి ముగింపు కాదు. అది నూతన అనుభవానికి పాఠశాల. ..... మేరి కొరెల్లి
 • అదిగో బాధ, గుండేనొప్పి అదే అనుభవము. .....ఎర్నెస్ట్ జాన్సన్
 • బాధయొక్క సారమే అనుభవము. .... ఆర్థర్ హెల్ప్స్.
 • ఆరిస్టాటిల్ గురించి ఎక్కువగా పిల్లలకు తెలుసు. ఎందుకంటే అతను అనుభవాన్ని ప్రోది చేసిన వాడు. .... ఐ. దిల్లార్జ్
 • ప్రతి కాలములోను తనదైన జాతీయతతో మానవ అనుభవము ప్రతిబింబిస్తుంది. ............ బెంజిమన్ ప్రాంక్లిన్
 • అనుభవాల క్రమమేజీవితం ............ స్వామి వివేకానంద
 • జీవితం నేటిది. ఐ అనుభవము కాదు. ............... జిడ్డు కృష్ణమూర్తి
 • అనుభవము వ్వక్తిత్వాన్ని పెంపొదిస్తుంది. ............. పెట్జెలి మెక్ లీన్
 • అనుభవము ఓ జీవిత పరిధి కాదు,, అది మనజాతి తరతరాలుగా మన కోసం దాచి వుంచిన శక్తి. ..... శ్యామూల్ స్మైల్స్
 • ఉపాద్యాయ అర్హత స్వంత అనుభవము, గమనము, పొరబాట్లు నుండే వస్తుంది. ......... మెకాలె
 • మానవుని అనుభవము మొత్తము సామాజికమైనదే .....................జాన్ డ్యూయి
 • అనుభవము జ్ఞానానికి మూలము. .............. రొమైన్ రొలాండ్
 • మనమతము అనుభవము మీద ఏర్పడిన మతము. ........... మార్క్ ట్వేన్
 • ఏ మానవుని జ్ఞానము కూడా అనుభవాన్ని మించి వుండదు. ........... జాన్ లాకె
 • మరొసారి తప్పు చేసేటప్పుడు అనుభవము ఆ తప్పు చేయకుండా వుండటానికి ఉపకరిస్తుంది. ..............ప్రాంక్లిన్ పి.జోక్స్
 • ఎన్నో సత్యాలున్నా వాటి అర్థము తమ వ్యక్తి గత అనుహవములోనే తెలుస్తాయి. ......... జాన్. ఎస్. మిల్
 • మనిషికేమి జరిగిందని కాదు. ఏదైనా జరిగినప్పుడు మనిషి స్పందనే అనుభవము. ...................ఆల్డన్ హాక్స్ లీ
 • ఎంతో అనుభవమున్న వాక్యంలో చెప్పేదే సామెత. ..............సెర్వాంటస్
 • జుట్టూడిన తర్వాత దువ్వెన ప్రసాదించినట్లు ............. బెల్జియం సామెత
 • ప్రయోగాలతో అనుభవము రాదు. అనుభవాన్ని సృష్టించ లేము. అనుభవాన్ని పొందాలి. .....ఆల్బర్ట్ కామూ
 • అనుభవము ఎంత నేర్పు గలదో అంతే నేర్పుతుంది. ...................ఆల్డ హాక్స్ లీ
 • అనుభవము స్వంతం, అది ఇతరులను తెలివి గల వాళ్ళను చెయ్యలేదు. ......... స్పైడింగ్
 • అనుభవాల దయ మీద జీవించే వాడు పరిణతి చెందినట్లు కాదు. . హెచ్.కూంబ్స్
 • పిల్లలు తమ అనుభవాలను తమ తల్లిదండ్రులనుండి స్వీకరిస్తారు. ................. జోసెఫ్. ఎ. కెనడీ.
 • ప్రజల మనోభాహావాలను ప్రభావితం చేయడం కంటే రాతికి జ్ఞానాన్ని పంచడం తేలిక. .విల్.ఎల్.గ్రిఫిత్
 • నిజమైన మతానికి గానీ, రాజకీయాలకు కాని సమాజానికి కాని తార్కికత కంటే అనుభవమే మూలము. ... పిల్.ఇ.కాంప్ బెల్
 • ఎదుటివాడి హావభావాలను బట్టి ఎక్కువ సార్లు మనుషులు మోసపోతారు. ....................హెచ్. కూంట్స్
 • అనుభవానికి అలోచనకి సమంవయంలేకుంటే మానసిక వ్యాధి గ్రస్తులవుతారు. ............హేస్టన్ పీతర్ సన్
 • పరిసరాల మార్పును బట్టి మన భావాలు, అనుభవాలు, అభిప్రాయాలూ మారుతాయి. ............ హేస్టన్ పీటర్ సన్
 • జ్ఞానం అనుభవముకంటే గొప్పది. జీవనస్పృహ జీవితంకంటే గొప్పది. .............. డి.జి.గారన్
 • అనుభవాలు మన జీవితాలను నడుపుతాయి. .......................డి.జి.గారన్
 • గొప్ప తెలివితేటలు కంటే గొప్ప అనుభవాల ద్వారనే గొప్ప ఆలోచనలు పుడతాయి. ..........గర్నెట్
 • కొందరు తలతో అనుభవిస్తూ హృదయముతో అలోచిస్తారు. .................... లిచెన్ బెర్గ్
 • చాలమంది స్త్రీలు వాళ్ళ శరీరానికి కలిగిన బాధ, నొప్పులకంటే ఎక్కువ అనుభవిస్తారు. ......జీనపాల్ సార్త్
 • అనుమానంతో అనుమానం. నమ్మకముతో నమ్మకము పెరుగుతాయి. ఇది మనిషికి అనుభవము నేర్పే అసలైన విద్య. .....వినోభాభావే
 • అనుభవము మనిషికి సంబవించేది కాదు. త్నకు సంబంధమున్న దానితో మనిషి చేసేది అనుభము. ..... అల్డస్ హాక్స్ లీ
 • ఇతరుల అనుభవాల నుండి నేర్చుకునే తేలికైన వారు వుంటారా? ........ఓల్టేర్
 • దైనందిన జీవిత అనుభవాలే ఉన్నత ఉపదేశాలు. .................... నైట్కీ
 • అనుభవమే గురువు. ............................ స్వామి వివేకానంద.
 • పడిన వాడి కంటే పడి లేచినవాడు గొప్ప. ఎందువల్ల నంటే అతడు లోతులు చూశాడు. .....ఎమర్సన్
 • ఈతకొట్టేవాడు లోతెరుగడు. బరువు మోసేవాడు భారం ఎరుగడు. ............. కొసరాజు
 • నీటిలో దిగితే కాని లోతు తెలియదు. ................ వేమన
 • పైకెళ్ళి క్రిందకు జారటం ఎంతో బాధో అనుభవము ద్వారా తెలుసుకుంటావు. ..... డాంటే
 • ప్రతి ఒక్కరు తమ పొరపాట్లకు పెట్టే పేరే అనుభవము. ............... ఆస్కార్ వైల్డ్
 • అనుభవములోకీ వస్తే కానీ ఏదైనా నిజంకాదు. అనుభవ పూర్వంకాని సూక్తి, సూక్తి కాదు. .... జాన్ కీట్స్

మూస:మూలం. సూక్తి సింధు

"https://te.wikiquote.org/w/index.php?title=అనుభవము&oldid=15840" నుండి వెలికితీశారు