ఆత్మ
ఆత్మ అనేది హిందూమతములోను, సంబంధిత సంప్రదాయాలలోను తరచు వాడబడే ఒక తాత్విక భావము. దీనిని గురించి వివిధ గ్రంధాలలో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే "ఆత్మ" అని చెప్పవచ్చును.
ఆత్మ పైన వ్యాఖ్యలు
[మార్చు]- ఆత్మశుద్ధి లేని యాచారమది యేల. - వేమన
- ఆత్మ దేనిచేతను అంటబడునదికాదు. కష్టము, సుఖము, పుణ్యము, పాపము అనునవి ఆత్మను అంటజాలవు. కాని దేహమే తాననుకొనువానికి మాత్రము ఇవిఅంటుకొనును. పొగ గోడనే మలినముగావించగలదుగాని అందుండు ఆకాశమును మలినము చేయజాలదు...రామకృష్ణ పరమహంస