ఇందిరా గోస్వామి

వికీవ్యాఖ్య నుండి
ఇందిరా గోస్వామి

ఇందిరా గోస్వామి (1942 నవంబరు 14 - 2011 నవంబరు 29) మామోనీ రైసోం గోస్వామిగా సుపరితురాలు. ఆమె భారతీయ రచయిత్రి, కవయిత్రి, ప్రొఫెసర్, ఉద్యమకారిణి. ఆమె అస్సామీ భాషలో సాహిత్యసృష్టి చేసిన రచయిత్రి. అస్సామీ సాహిత్యానికి ఆమె చేసిన కృషి వల్ల జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడెమీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందారు. [1]


వ్యాఖ్యలు[మార్చు]

  • ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రక్రియ చారిత్రాత్మక ముందడుగు. అస్సాం ప్రజలు మీకు, మీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.[2]
  • ఉల్ఫాను చర్చల పట్టికలోకి తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం కాబట్టి అన్ని వివాదాస్పద అంశాలపై ప్రభుత్వంతో చర్చించాలని మేము ఆశిస్తున్నాము.
  • ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఢిల్లీలో ప్రభుత్వం రెండో దఫా చర్చలు జరపనుందని, అయితే చర్చల విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదన్నారు.
  • కేంద్రం, పీసీజీ మధ్య తదుపరి విడత చర్చలు చాలా కీలకం కానున్నాయి, ఈ సమావేశం ఫలితం శాంతి ప్రక్రియ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.
  • ప్రస్తుత ఉద్రిక్తతను తగ్గించడానికి దయచేసి ప్రభావిత ప్రాంతాల నుండి భద్రతా దళాలను ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలించాలని నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. శాంతి ప్రక్రియను సానుకూల లక్ష్యం వైపు తీసుకెళ్లడానికి ఇటువంటి చర్య మాకు సహాయపడుతుందని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను.


మూలాలు[మార్చు]

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.