భారత దేశం
Appearance
భారత దేశం కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న సువిశాల దేశం. విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూ, ప్రపంచాన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న దేశం.
దేశం గురించి వ్యాఖ్యలు
[మార్చు]- భరత ఖండంబు చక్కని పాడియావు --చిలకమర్తి లక్ష్మినరసింహం
- ఆర్య భూమి, సూర్య భూమి, వీరభూమిరా మనది--బోయి భీమన్న
- ఏ దేశ మేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని --రాయప్రోలు సుబ్బారావు
- నా దేశ పటాన్ని కొరికేసినై సామంతుల చిట్టెలుకలు --కుందుర్తి ఆంజనేయులు
- ఈ దేశం నాదనటం ఎప్పటిదో పాతమాట, ఈ దేశం నేనేనడం ఇది నవకవితా సూక్తం--ముదిగొండ శివప్రసాద్
- దేవుడా! రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి...--దేవరకొండ బాలగంగాధర తిలక్
- దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!!--గురజాడ అప్పారావు
- నేను కవిని, నేను రవిని, నా దేశపు ప్రగతి రథచోదకుడిని--ఎల్లోరా
- వీరభోగ్య వసుంధరా! పేరబరగు భారతాంబరో నేనెంత ప్రస్తుతింప---బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త[1]
- శాస్త్రం అలికిన పొలం నా దేశం/ విద్దెలు నింపిన గాదె ఈ దేశం---పాకాల యశోదారెడ్డి[2].]
- నా భారతదేశమా! నా మాతృదేశమా! నిలుపుకో నీ జాతి సాంప్రదాయం,నీ జాతి సౌమనస్యం నిలుపుకో నిలుపుకో---మల్లిక్[3]
మూలాలు
[మార్చు]- తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994.
- ↑ నవ్య జగత్తు - అక్షరార్చన, రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్, పుట- 33
- ↑ పాలమూరు కవిత(నా దేశం-పాకాల యశోదారెడ్డి),సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-1
- ↑ ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-175