మహాత్మా గాంధీ
Appearance
(గాంధీ మహాత్ముడు నుండి మళ్ళించబడింది)
మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యుడు. గాంధీజీ 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోరుబందర్‌లో జన్మించాడు. 1948 జనవరి 30న హత్యకు గురైనాడు.
గాంధీ చేసిన వ్యాఖ్యలు
[మార్చు]- అహింసకు మించిన ఆయుధం లేదు.
- ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి.
- ఆలోచనల పరిణామమే మనిషి. అతను ఎలా ఆలోచిస్తే అలా తయారౌతాడు.
- కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.
- ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.
- ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు.
- భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వస్తుంది.
- మార్పునుకు సిద్ధంగా ఉండండి. అపుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.
- పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది.
- హక్కులకు వాస్తవమైన మూలాధారం-కర్తవ్య నిర్వహణం.మనం మన కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే హక్కులు పొందేందుకు ఎంతో దూరంలో ఉండము.మన విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం పరుగెత్తినట్లయితే అవి మనల్ని దాటి పోతాయి.మనం ఎంతగా వాటిని వెంబడిస్తే అవి అంత త్వరితంగా ఎగిరిపోతాయి.
- మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది.మానవత్వం అనే పుస్తకం కంటే వేరొక ఉత్తమ గ్రంధం ఏమి ఉంటుంది.ప్రపంచం ఆధిపత్యం వహించిన పటిష్టవంతమైన శక్తి-ప్రేమ.మరియు అది వినయం గల కల్పనా రూపము.ప్రేమ ఎక్కడ ఉంటుందో,దేవుడు కూడా అక్కడే ఉంటాడు.
- జీవితంలో స్వచ్చమైనవి మరియు ధార్మికమైనవి అయిన వాటన్నిటికీ స్త్రీలు ప్రత్యేక సంరక్షకులు.స్వభావరీత్యా మితవాదులైనందువల్ల మూఢాచారాలను విడనాడటంలో ఆలస్యం చేస్తారు. అలాగే జీవితంలో స్వచ్చమైనవి,గంభీరమైనవి వదిలి పెట్టేందుకు కూడా అలస్యం చేస్తారు.
- విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకుంటే వారు చదువంతా వృధా.
- ఎవరైతే చిరునవ్వుల్ని ధరించరో వారు పూర్తిగా దుస్తులు ధరించినట్లు కాదు.
- ఒక అభివృద్ది చెందిన కంఠం నుండి ఉత్తమ సంగీతం సృష్టించే కళను అనేకమంది సాధించవచ్చు కానీ ఒక స్వచ్చమైన జీవితం అనే మధురస్వరము నుండి అటువంటి సంగీతకళను పెంపు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది. అన్ని కళల కంటే జీవితం గొప్పది. పరిపూర్ణత్వానికి చేరువ కొచ్చిన జీవితం గల మానవుడే అత్యంత గొప్ప కళాకారుడని నేను ప్రకటిస్తాను.సౌజన్యతగల జీవితం యొక్క గట్టి పునాది లేని కళ ఏమిటి?
- మన ప్రార్థన హృదయ పరిశీలన కోసం.భగవంతుని మద్దతు లేకుండా మనం నిస్సహాయులమని మనకు అది గుర్తు చేస్తుంది.దాని వెనుక భగవంతుని దీవెన లేనట్లయితే ఉత్తమమైన మానవ ప్రయత్నం కూడా నిష్పలమౌతుంది.
- సత్యాగ్రహము జయమైందని ప్రజలు సంతోషించారే కాని సంపూర్ణ విజయ లక్షణాలు లోపించడం వలన నాకు సంతృప్తి కలుగలేదు.
- కైరా సత్యాగ్రహం పాక్షికంగా విజయవంతం కావడంపై గాంధీ చేసిన వ్యాఖ్య
- నన్ను ఢిల్లీ వాసులు పిలవడం వలన అచ్చట శాంతి నెలకొల్పడం కోసం వెళ్తున్నాను కాని అశాంతి నెలకొల్పడం కోసం కాదు.
- రౌలత్ చట్టం తర్వాత జాతీయోద్యమ నాయకులు గాంధీని ఢిల్లీ రమ్మని పిలిచినప్పుడు గాంధీ ఢిల్లీ వెళ్ళగా పోలీసులు రైలు దింపినప్పుడు గాంధీ చేసిన వ్యాఖ్య.
- మన అభిప్రాయాలను ఇతరులపైన బలవంతంగా రుద్దడం వలన మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోలేము.
- నాగ్పూర్ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో గాంధీజీ వ్యాఖ్య.
- మనిషిని బాధించే జంతువులను చంపకూడదని నా అభిప్రాయం కాదు. ఏది హింస, ఏది అహింస అన్నది మనుషులు తమ విచక్షణతో తెల్సుకోవాలి.
- హరిజన్ పత్రికలో గాంధీ వెలిబుచ్చిన అభిప్రాయం.
- నా మట్టుకు సత్యాగ్రహ ధర్మ సూత్రం ప్రేమ సూత్రం లాంటిది. ఒక అనంతమైన శాశ్వతమైన సిద్ధాంతం. సత్యాగ్రహ నియమాలు ఒక క్రమపరిణామాన్ని కలిగి ఉంటాయి.
- సత్యాగ్రహ ధర్మ సూత్రం గురించి గాంధీజీ తన పుస్తకంలో వివరించిన వ్యాఖ్యలు.
- ప్రజాస్వామ్య స్పూర్తిని ఇతరులెవ్వరూ బలవంతంగా రుద్దలేరు, అది అంతర్గతంగా, స్వతసిద్ధంగా వికసించాల్సి ఉంటుంది.
- విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణా సహితంగా లేకపోతే వారి చదువంతా వృథా.
- చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.
- చదవడం వలన ప్రయోజనమేమంటే నలుమూలల నుంచీ వచ్చే విజ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి గుణపాఠాలు తీసుకోవడం.
- ఆచరించడం కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టకూడదు. ఓర్పుతో వాటిని ఆచరించాలి.
- ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడని రాబోయే తరాలవారు నమ్మలేరు
- మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ ఆభిప్రాయాలు మేలైనవి. ఆయన చెప్పినట్లుగా మనం నడచుకోవాలి. మనకు కావలసినదాని కోసం హింసతో పోట్లాడటము కాదు. ఆన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత - ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్
- జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు -మార్టిన్ లూథర్ కింగ్
- కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటై పుట్టితేనేమి.-- బసవరాజు అప్పారావు.