Jump to content

గౌరవం

వికీవ్యాఖ్య నుండి



వ్యాఖ్యలు

[మార్చు]
  • ఏ వివాహమైనా పనిచేయాలంటే పరస్పర గౌరవం, నమ్మకం ఉండాలి-అమల
  • మంచిగా ఉండడం గౌరవం.ఇతరులకు మంచిగా వుండమని శిక్షణ నివ్వడం మరింత గౌరవం.అంతే కాకుండా తక్కువ కష్టం-మార్క్ ట్వెయిన్
  • కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం-త్రివిక్రం శ్రీనివాస్
  • బర్మాలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ప్రాణాల కోసం, గౌరవం కోసం జరుగుతున్న పోరాటం. ఇది మన రాజకీయ, సామాజిక, ఆర్థిక ఆకాంక్షలతో కూడిన పోరాటం-అంగ్ సాన్ సూకీ
  • మీ చర్మం ఏ రంగులో ఉంది, మీరు ఏ భాష మాట్లాడతారు, మీరు ఏ మతాన్ని విశ్వసిస్తున్నారనేది ముఖ్యం కాదు. మనమందరం ఒకరినొకరు మనుషులుగా పరిగణించాలి. మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. మన హక్కుల కోసం, పిల్లల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, ప్రతి మనిషి హక్కుల కోసం మనందరం పోరాడాలి-మలాలా యూసఫ్‌జాయ్
  • నేను నోబెల్ గ్రహీతగా ఎంపిక కావడం, నేను ఈ అమూల్యమైన నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక కావడం ను నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డును అందుకున్న మొదటి పాకిస్థానీ యువతి లేదా యువకుడిని అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఇది నాకు గొప్ప గౌరవం. నేను ఈ పురస్కారాన్ని భారతదేశానికి చెందిన ఒక వ్యక్తితో పంచుకుంటున్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. అతని పేరు కైలాష్ సత్యార్థి, బాలల హక్కుల కోసం, బాలల బానిసత్వానికి వ్యతిరేకంగా అతను చాలా గొప్ప పనిచేశాడు-మలాలా యూసఫ్‌జాయ్
"https://te.wikiquote.org/w/index.php?title=గౌరవం&oldid=17945" నుండి వెలికితీశారు