మార్క్ ట్వెయిన్
స్వరూపం
మార్క్ ట్వెయిన్ (Mark Twain) అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత. ఇతడు 1835, నవంబర్ 30న జన్మించాడు. ఏప్రిల్ 21, 1910న మరణించాడు.
మార్క్ ట్వెయిన్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
[మార్చు]- చట్టాన్ని ఆశ్రయించడమంటే పిల్లి కోసం ఆవును పోగొట్టుకోవడం.
- ఒకవేళ ప్రపంచంలోని మూర్ఖులందరూ చనిపోతే నేను ఒంటరిగా ఎలా జీవించాలో!
- పాలకులు నిరంకుశులుగా తయారైతే ప్రజలు అలాంటి వారిని చెత్తబుట్టలో విసిరిపారేస్తారు.
- నేను ఒక నియమం పెట్టుకున్నాను. నిద్రపోయేటప్పుడు పొగతాగకూడదని.
- మనుషులందరూ ఒకేలా ఆలోచిస్తే ఏమీ బాగుండేది కాదు. ఆ అభిప్రాయభేదాలవల్లే కదా గుర్రప్పందాలు జరుగుతున్నాయి.
- ఏప్రిల్ ఫూల్స్ డే... మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు.
- మన మతం అనుభవం మీద ఏర్పడిన మతం.
- ఆకలితో ఉన్న కుక్కను చేరదిస్తే అది కరవనుగాక కరువదు. మనిషికి కుక్కకు ఉన్న తేడా అదే.
- జననమంటే ఆనందం. మృత్యువంటే ఏడుపు ఎందుకు?
- నిజం తన బూట్లు వేసుకొనేలోపు అబద్ధం ప్రపంచంలో సగం చుట్టివస్తుంది.
- ఒకే రకంగా ఆలోచించాలనడం మంచిది కాదు.అభిప్రాయ భేధాలే గుర్రపు పందాలు.
- మరొకరి బాధ నుండి తను జన్మిస్తాడు.తన బాధతో తను మరణిస్తాడు. ఆలోచనలూ అంతే.
- మంచిగా ఉండడం గౌరవం.ఇతరులకు మంచిగా వుండమని శిక్షణ నివ్వడం మరింత గౌరవం.అంతే కాకుండా తక్కువ కష్టం.
- ఏకాంతంగా ఉన్నప్పుడు ఏ మనిషికి తన మీద తనకే గౌరవం ఉండదు.
- అమెరికాను కనుక్కోవడం ఆశ్చర్యం, కనుక్కోకుండా ఉండటం మరింత ఆశ్చర్యం.
- మనిషి తన అంతరంగాన్ని ఆలోచిస్తే గౌరవం కనిపించదు.
- రెండు భావాల అనుకోని బంధం చమత్కారం.
- మనం ఎనభై ఏళ్ల వయసులో పుట్టి పద్దెనిమిది ఏళ్ల వయసుకి ఎదిగితే అదే అంతులేని ఆనందం.
- దుర్మార్గులతో ఎవ్వరూ పోటీపడకూడదు.వారి పట్ల కృతజ్ఞతతో ఉండడమే మేలు.
- దేవుని వలన మనకి మూడు వరాలు లభించాయి. వాక్ స్వాతంత్ర్యం,భావ స్వేఛ్ఛ. ఆ రెండింటిని ఆచరించని వివేకం మూడవది.
- ధర్మకర్తల వ్యవస్థ తెలివి మీద నిజాయితీ మీద ఆంక్షలు విధిస్తుంది. అంతే కాదు మూర్ఖత్వం అవివేకాన్ని రక్షిస్తుంది.
- మొదట దేవుడు మూర్ఖులను తర్వాత పాఠశాల కమిటీలను సృష్టించాడు.
- ఆటలు,పని ఒకటే పరిస్థితులు,పేర్లలో తేడానే కారణం.
- రాచమర్యాదలు ముందు, నీతి తర్వాత.
- ఇతరుల దారులంటే మనకు వయసు పెరగదు.
- మూర్ఖులకు కృతజ్ఞతలు.వాళ్లే లేకపోతే మనం గెలుపు వైపు నిలబడలేము.
- మనం పిచ్చివాళ్లని గుర్తుంచుకుంటే కొన్ని రహస్యాలు మాయమవుతాయి. జీవితం అర్దమవుతుంది.
- మంచి పుస్తకం చదవని వాడు ఏ పుస్తకం చదవని వాడు ఒకటే.
- ఒకేసారి రెండు సిగరెట్లు కాల్చకూడదని నేనొక నియం పెట్టుకున్నాను.
- జీవితంలో కష్టలెన్నో...ప్రేరేపణలు..తుఫానుదారులు....
- బైబిల్ లో అర్ధం కాని భాగాల కంటే అర్ధమైన భాగాలే నన్ను ఇబ్బంది పెట్టాయి.
- భ్రాంతి నుండి విడివడకు, బ్రాంతి విడిపోతే నువ్వు బ్రతకవచ్చు కాని జీవితానికి దూరం కాలేవు.
- సరైన పదానికి,దాదాపు సరైన పదానికి కాంతికి,కాంతివంతమైన నల్లికి వున్నంత తేడా వుంది.
- ఆత్మ సజీవం అనుకోవడానికి ఖరణం వేల సంవత్సరాల నమ్మిక, అలాగే భూమి అల్లపరుపుగా వుందనుకోవడం కూడా.
- నేను చనిపోయానని చెప్పడం అతిశయోక్తి.
- ఆదాముకు మనం ఋణపడి వున్నాము. అతను మరణాన్ని కనుగొని మానవజాతికి గొప్ప మేలు చేశాడు.
- స్వర్గ నరకాలను గురించి నేనెమీ చెప్పను. రెందు చోట్ల నాకు మిత్రులున్నారు.
- ఈ జీవితంలో విజయం తప్పని సరి కావడానికి కావలసింది అవివేకం మన మీద మనకు నమ్మకం.
- దుస్తులు పుట్టగానే వినయం మరణించింది.
- అంతా శిక్షణలోనే నేటి దివ్య ఫలం పూర్వం వగరైన బాదం పండు. ఉన్నతవిద్యతో కాలీఫ్లవర్ క్యాబేజి అయ్యింది.
- చేతులు మారిన పాత వజ్రాలు వుండటం అసలేమీ లేకుండా వుండటం కంటే మంచిది.
- మనకు లభించిన వాటిలో సత్యం అత్యంత విలువైనది.దాన్ని మనం మతంగా ఉపయోగించుకో.
- సత్యం శక్తివంతం అది నశించదు.
- సంతోషం కాదు విచారమే హాస్యానికి మూలాధారం.
- మనం ఆనందంగా ఉండడానికి మంచి మార్గం.ఇతరులను ఆనందంగా ఉంచడమే