Jump to content

తిక్కన

వికీవ్యాఖ్య నుండి

తిక్కన లేదా తిక్కన సోమయాజి మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయంలో ఒకడు. తిక్కన 13వ శతాబ్దికి చెందిన కవి. కవిత్రయంలో రెండవవాడు. ఇతడు నెల్లూరు మనుమసిద్ధి వద్ద ఆస్థానకవిగా పనిచేశాడు. ఇతడికి "కవిబ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు కలవు. తిక్కన ఆంధ్రమహాభారతపు నాలుగవ పర్వం నుండి ప్రారంభించి 15 పర్వాలు రచించాడు. ఇతడు రచించిన కావ్యాలలో ముఖ్యమైనది నిర్వచనోత్తన రామాయణం. ప్రముఖ కవి కేతన తిక్కన శిష్యుడు.

తిక్కనపై ఉన్న ముఖ్య వ్యాఖ్యలు

[మార్చు]

తిక్కనరచించిన కొన్ని పద్యాలు

[మార్చు]
శ్రీయన గౌరినాఁబరఁగు చెల్వకుఁ జిత్తము పల్లవింప పల్లవింప భ
ద్రాయుత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వముఁగొల్చెద నిష్ట సిద్ధికిన్

తిక్కన కాలంలో వైష్ణవులకూ, శైవులకూ మధ్య వైషమ్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అటువంటి సమయంలో "ఉభయ కవి మిత్రుడు" అనిపించుకొన్న తిక్కన తన భారతాంధ్రీకరణను హరిహర రూపమైన పరతత్వమును ఇష్టసిద్ధికై కొలుస్తూ ఈ పద్యం చెప్పాడు.


విరాట పర్వంలోని ఒక పద్యం

సింహం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్య త్క్రోధమై వచ్చు నో
జం గాంతార వాస భిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్


ఉత్తర గోగ్రహణం జరిపిన కౌరవ సైన్యంపై అర్జునుడే యుద్ధానికి రావడం చూసి ద్రోణాచాఱ్యుడిలా అన్నాడు - సింహం గుహలో ఆకలితో ఉండి, ఒక్కసారిగా ఏనుగుల మందను చూచి ఉత్సాహంతో ఉరికినట్లుగా, అరణ్యవాసంతో భిన్నుడై వీడే, ఈ కుంతీ సుత మధ్యముడే యుద్ధానికి తయారై వచ్చాడు. - ఇక్కడ "వీడే" అన్న పదం మరింత శిష్య వాత్సల్యాన్ని సూచిస్తుంది. "కుంతీ సుత మధ్యముండు" (అంటే భీముడు కావాలి గదా!) అన్న పదాలపై కూడా కొన్ని చర్చలు జరిగాయి.

"https://te.wikiquote.org/w/index.php?title=తిక్కన&oldid=5724" నుండి వెలికితీశారు